Talasani Srinivas Yadav | మేడిగడ్డలో కుంగింది రెండు పిల్లర్లే.. SLBC కుంగి 8 మంది చనిపోయారు.. దీనిపై ఎందుకు విచారణ చెయ్యలేదు : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | కాళేశ్వరం (Kaleswaram) కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav | కాళేశ్వరం (Kaleswaram) కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేధా పర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే.. అది తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజానీకాన్ని ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ (KCR) అని తలసాని కొనియాడారు.
గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని.. అప్పుడు తెలంగాణ కోసం 420 మంది అమరులయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్‌తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారని తెలిపారు.
ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు..?
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండేళ్లకు పైగా అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు..? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆ ఫైల్‌ను గవర్నర్ దగ్గరకు పంపించినట్లు తెలిపారు. ఆ తర్వాత తమ ప్రభుత్వం అధికారం కోల్పోయిందన్నారు.
రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ మాపై దుష్ప్రచారం చేశారు
సుంకీశాల వాల్, పెద్ద వాగు, వట్టేం మునిగిపోయింది, SLBC కుంగిపోయి 8 మంది చనిపోయారు. దీనిపై ఎందుకు విచారణ చెయ్యలేదు. కాళేశ్వరం అంటే 100 కంపోనెట్లు. అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. 8B , 8C ద్వారా నోటీసులు ఇవ్వకుండా కాళేశ్వరం కేసు విషయంలో విచారణ చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. కాళేశ్వరం విషయంలో రాహుల్, రేవంత్ కలిసి రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ మాపై దుష్ప్రచారం చేశారు. మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేస్తామని L&T ముందుకు వస్తే బెదిరించారు. మేడిగడ్డ కుంగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చిన NDSA.. SLBC కుంగి 8 మంది చనిపోతే ఎందుకు రాలేదు.
కాళేశ్వరం ద్వారానే రాష్ట్రంలో అత్యధికంగా వరి
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం వచ్చింది. వచ్చిన ధాన్యం చూసి కేంద్రమే ఆశ్చర్యపోయింది. ఆఖరికి వరి మేము కొనలేమని కేంద్రం చెప్పింది. కానీ, కాంగ్రెస్ మాత్రమే.. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే వరి సాగు అత్యధికంగా వచ్చిందని అబద్దాలు ప్రచారం చేసుకుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది పరిపాలన మంచిగా చెయ్యమని.. బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం కాదు. కేరళ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేశారు.
ఎన్డీయే నేతలతో రేవంత్ బ్రేక్‌ఫాస్ట్..
రేవంత్ రెడ్డి తీరుపై తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ఎన్డీయే కూటమి నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ అలా చేస్తుంటే.. తెలంగాణలో ఉండే నిజమైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన చెయ్యండి అంటూ కాంగ్రెస్ నేతలకు తలసాని సూచించారు.
Also Read..
టార్గెట్లు కాదు.. కస్టమర్ల భద్రతే ముఖ్యం!!
ఎల్లుండి కవిత కొత్త పార్టీ.. తెలంగాణ ప్రజా జాగృతి కోసం దరఖాస్తు
నాటి విమర్శకుడే.. నేడు ఆప్తుడయ్యాడు.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



