త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డ‌లా కాపాడండి.. ఒక అభిమాని గుండె చ‌ప్పుడు ఇది..

KCR | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత‌లు.. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చావును కోరుకుంటున్నామ‌ని బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ చావును కోరుకుంటున్నామ‌ని వారు చేసిన వ్యాఖ్య‌ల‌తో ఓ గులాబీ అభిమాని గుండె బరువెక్కిపోయింది.

S

Telangana | Published On Sep 9, 2026, 11.17 pm IST

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డ‌లా కాపాడండి.. ఒక అభిమాని గుండె చ‌ప్పుడు ఇది..
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత‌లు.. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చావును కోరుకుంటున్నామ‌ని బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ చావును కోరుకుంటున్నామ‌ని వారు చేసిన వ్యాఖ్య‌ల‌తో ఓ గులాబీ అభిమాని గుండె బరువెక్కిపోయింది. నా నాయ‌కుడికి ఏమీ కాకూడ‌దు.. కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తూ.. ఓ అభిమాని కేసీఆర్ క్షేమాన్ని కాంక్షిస్తూ రాసిన లేఖ‌ను తిరుమ‌ల హుండీలో వేశారు.

లేఖ సారాంశం ఇదే..

వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి నా మ‌న‌సులోని విన్న‌పం.. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామి వారి పాద‌ప‌ద్మాల‌కు..

స్వామీ..

నా మ‌న‌సులో ఉన్న ఒక్క కోరిక‌తో ఈ లేఖ‌ను మీ హుండీలో వేస్తున్నాను.

మా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో ఉండేలా ఆశీర్వ‌దించండి స్వామీ. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం త‌న ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా ఎన్నో క‌ష్టాల‌ను సైతం లెక్చ‌లేకుండా ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కోని, చివ‌రి అంచు వ‌ర‌కు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మ‌హానుభావుడు కేసీఆర్ గారు. ఆయ‌న‌పై ఎంత విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఎంత మంది వ్య‌తిరేకించినా ఆయ‌న ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని, మ‌ళ్లీ కేసీఆర్ సీఎం కావాల‌ని కోరుకునే అభిమానులం మేం. కానీ ఈ రోజు కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు కేసీఆర్ గారికి చెడు జ‌ర‌గాల‌ని, ఆయ‌న చావును కోరుకుంటూ మాట్లాడ‌డం నా మ‌న‌సును ఎంతో బాధిస్తోంది స్వామీ..

రాజ‌కీయాలు ఎలా ఉన్నా ఒక మ‌నిషి ప్రాణం ఆరోగ్యం గురించి చెడుగా కోరుకోవ‌డం ఎవ‌రికీ మంచిది కాదు. అందుకే మీ స‌న్నిధికి వ‌చ్చి నా మ‌న‌సులోని బాధ‌ను, నా కోరిక‌ను మీ పాదాల ద‌గ్గ‌ర ఉంచుతున్నాను వెంక‌న్న‌. మా కేసీఆర్‌ను మీ బిడ్డ‌లా కాపాడండి.

కేసీఆర్ గారూ ఆరోగ్యంగా ఉండాలి.. సంతోషంగా ఉండాలి.. నిండు నూరేళ్లు జీవించాలి. ఇదే నా మ‌న‌స్ఫూర్తి కోరిక స్వామీ..

గోవిందా.. గోవిందా.. జై తెలంగాణ‌..

Advertisement
Advertisement