త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRICS Trade Union Forum 2026 | హైదరాబాద్‌లో ఘనంగా ‘బ్రిక్స్’ సదస్సు: మారుతున్న టెక్నాలజీ.. కార్మికుల భవిష్యత్తుపై కీలక అడుగులు

హైదరాబాద్ వేదికగా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 ఘనంగా ప్రారంభమైంది. ఏఐ వల్ల భవిష్యత్ ఉద్యోగాలపై పడే ప్రభావం, కార్మికుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి.

J

Hyderabad | Published On Jul 14, 2026, 10.00 pm IST

BRICS Trade Union Forum 2026 | హైదరాబాద్‌లో ఘనంగా ‘బ్రిక్స్’ సదస్సు: మారుతున్న టెక్నాలజీ.. కార్మికుల భవిష్యత్తుపై కీలక అడుగులు
Advertisement
  • హైదరాబాద్‌లో 3 రోజుల పాటు 'బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026' ప్రారంభం
  • 14 దేశాల నుంచి సుమారు 110 మంది ప్రతినిధుల హాజరు
  • ఆతిథ్యమిస్తున్న బీఎంఎస్ (BMS)
  • సమావేశాలను అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి మాండవీయ, రాష్ట్ర మంత్రి వివేక్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ల నేపథ్యంలో కార్మికుల స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రధాన చర్చ

BRICS Trade Union Forum 2026 | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ దేశాల ప్రతినిధులకు హైదరాబాద్ (Hyderabad) మరోసారి వేదికైంది. నగరంలోని మారియట్ హోటల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026" (BRICS Trade Union Forum Summit) మంగళవారం (జూలై 14) ఘనంగా ప్రారంభమైంది. జూలై 16 వరకు మూడు రోజుల పాటు సాగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును.. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారికంగా ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం 'భారతీయ మజ్దూర్ సంఘ్' (BMS) ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.

భవిష్యత్ ఉద్యోగాలపై ఏఐ (AI) ఎఫెక్ట్

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

BRICS Trade Union Summit 2026 Begins in Hyderabad Focus on AI and Jobs

"ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ (Automation) ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో కార్మికులకు సామాజిక భద్రత (Social Security), నైపుణ్యాభివృద్ధి (Skill Development) అత్యంత అవసరం. కార్మికులు తమ ఉద్యోగాలు, భవిష్యత్తుపై భరోసాతో ఉన్నప్పుడే పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుంది," అని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ యువతకు 'టామ్‌కామ్' దన్ను

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివేక్ సదస్సుకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసి, యువతకు అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.

BRICS Trade Union Summit 2026 Begins in Hyderabad Focus on AI and Jobs

ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు.. ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలంగాణ యువతకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సదస్సులో 14 దేశాల ప్రతినిధులు

ఈ బ్రిక్స్ సమ్మిట్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ (UAE), బెలారస్, మలేషియా, నైజీరియా తదితర 14 దేశాలకు చెందిన 110 మంది డెలిగేట్స్ (Delegates) పాల్గొంటున్నారు. కార్మిక సంక్షేమం, లేబర్ రైట్స్ (Labour Rights), వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపై వీరు విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కీలక సిఫార్సులను రూపొందించనున్నారు.

BRICS Trade Union Summit 2026 Begins in Hyderabad Focus on AI and Jobs

Advertisement
Advertisement