EPFO | ఇక ఈపీఎఫ్ సేవలు వాట్సాప్‌లోనే.. రూ.5 కోట్ల పీఎఫ్ నగదుకు మోక్షం..
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, లావాదేవీల వివరాలు తెలుసుకునే సదుపాయంతోపాటు, రూ.1వేయి వరకు నిలిచిపోయిన అర్హత కలిగిన పీఎఫ్ ఖాతాల్లోని నగదును ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, లావాదేవీల వివరాలు తెలుసుకునే సదుపాయంతోపాటు, రూ.1వేయి వరకు నిలిచిపోయిన అర్హత కలిగిన పీఎఫ్ ఖాతాల్లోని నగదును ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.
రూ.5 కోట్ల నగదు సెటిల్‌మెంట్..
కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈపీఎఫ్ఓ చందాదారులకు సేవలు మరింత చేరువ కానున్నాయి. పీఎఫ్‌కు సంబంధించిన సాధారణ వివరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పత్రాల సమర్పణ భారాన్ని తగ్గించి, ఉద్యోగులు తమ పదవీ విరమణ పొదుపులను సులభంగా పొందేలా ఈ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ సదుపాయం ద్వారా సుమారు లక్ష నిష్క్రియ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.5 కోట్ల నగదు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ అధికారికంగా ధ్రువీకరించిన వాట్సాప్ సేవ ద్వారా చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల వివరాలు, పాస్‌బుక్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై)కు సంబంధించిన అవసరాలపై వ్యక్తిగత మార్గదర్శకత్వం, సహాయాన్ని కూడా ఈ సేవ ద్వారా పొందవచ్చు. సాధారణ పీఎఫ్ వివరాల కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్‌లోనే సమాచారం అందుబాటులోకి రానుంది.
తక్కువ పీఎఫ్ ఉంటే ఆటోమేటిక్ సెటిల్‌మెంట్..
మరోవైపు, రూ.1వేయి లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న అర్హత కలిగిన నిష్క్రియ పీఎఫ్ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన ఖాతాదారులు తమ నగదును పొందేందుకు ప్రత్యేకంగా విత్‌డ్రాయల్ క్లెయిమ్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. గుర్తింపు, బ్యాంకు ఖాతా వివరాల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ఓ స్వయంగా సెటిల్‌మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు మారిన తర్వాత చిన్న మొత్తాల పీఎఫ్ నగదును క్లెయిమ్ చేయకుండా వదిలేసిన మాజీ ఉద్యోగులు, ఇతర చందాదారులకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | మద్యం మత్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి
- ●Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- ●Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..
- ●Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!
- ●Ration | నేటి నుంచి నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ
- ●Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత

Hyderabad | మద్యం మత్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి

Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..

Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!






