Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 లోగో ఆవిష్కరణ
Khelo India Youth Games | తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
Khelo India Youth Games | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు. మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
తాజావార్తలు
- ●Ashika Ranganath | అల్లు అర్జున్‌తో యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది కానీ - కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ట్విస్ట్
- ●Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి
- ●China Electric Passenger Plane | ఫ్యూయల్ లేకుండా ఎగిరే 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం సక్సెస్.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ. ప్రయాణం!
- ●Extension Orders | సీనియర్లకు ఎక్స్టెన్షన్లు ఇస్తూ పోతే జూనియర్ల సంగతేంటి?
- ●BRS NRI | దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి
- ●Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!

Ashika Ranganath | అల్లు అర్జున్‌తో యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది కానీ - కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ట్విస్ట్

Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి

China Electric Passenger Plane | ఫ్యూయల్ లేకుండా ఎగిరే 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం సక్సెస్.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ. ప్రయాణం!

Extension Orders | సీనియర్లకు ఎక్స్టెన్షన్లు ఇస్తూ పోతే జూనియర్ల సంగతేంటి?



