Nampally Court | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. నాంపల్లి కోర్టులో రెండు బాంబులు పేలుతాయి అని గుర్తు తెలియని వ్యక్తులు కోర్టుకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది, లాయర్లు బయటకు పరుగెత్తారు. కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి.. బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు.