త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్: భట్టి విక్రమార్క

hatti Vikramarka | ఆర్టీసీ-మెట్రో కామ‌న్ పాస్‌తో (RTC Metro Common Pass) ప్ర‌యాణం మ‌రింత సుల‌భ‌మ‌వుతుంద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) అన్నారు. ‎మెట్రో, ఆర్టీసీ సేవల సమన్వయంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యం ఉంటుంద‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Oct 3, 2026, 12.14 pm IST

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్: భట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్‌: ఆర్టీసీ-మెట్రో కామ‌న్ పాస్‌తో (RTC Metro Common Pass) ప్ర‌యాణం మ‌రింత సుల‌భ‌మ‌వుతుంద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) అన్నారు. ‎మెట్రో, ఆర్టీసీ సేవల సమన్వయంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యం ఉంటుంద‌ని చెప్పారు. ‎మెట్రో దిగిన తర్వాత బస్సు కోసం ప్రయాణికులకు ఇక అయోమయం ఉండద‌ని వెల్ల‌డించారు. ప్రయాణికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క‌, మంత్రులు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అధికారులు బేగంపేట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఒకే పాస్‌తో మెట్రో-ఆర్టీసీ ప్రయాణం ప్రయాణికులకు సౌకర్యవంతమైన విధానమ‌ని చెప్పారు. ‎కామన్‌ పాస్‌ చాలా మంచి, అనుకూలమైన విధాన‌మ‌ని ప్రయాణికులు చెప్పార‌న్నారు.

‎మెట్రో ప్రయాణికులకు గమ్యస్థానానికి చేరుకునేలా తొలి కనెక్టివిటీగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయ‌ని తెలిపారు. ‎మెట్రో-ఆర్టీసీ అనుసంధానాన్ని మరింత విస్తరిస్తామ‌ని చెప్పారు. ‎ఇంటి నుంచి గమ్యస్థానం వరకు సులభమైన ప్రయాణమే ప్రభుత్వ లక్ష్య‌మ‌న్నారు. ‎భవిష్యత్‌లో మెట్రో-ఆర్టీసీతో పాటు ఆటోలు, ఊబర్‌ సేవలను అనుసంధానించే ఆలోచన ఉంద‌న్నారు. ‎చివరి గమ్యస్థానానికి చేరుకునేలా ‘లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ’పై ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని వెల్ల‌డించారు. ప్రజా రవాణా వ్యవస్థను సమగ్రంగా అనుసంధానం చేస్తామ‌ని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్ తీసుకొచ్చామ‌న్నారు. ‎కామన్‌ పాస్‌ను అందుబాటులోకి తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Ponnam Prabhakar) కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement