Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
Gold And Silver Prices Today | గత కొద్ది నెలలుగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. బులియన్ మార్కెట్లలోనూ అస్థిరత నెలకొంది. పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్ రాబడులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై ప్రభావం చూపిస్తున్నాయి.
Gold And Silver Prices Today | గత కొద్ది నెలలుగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. బులియన్ మార్కెట్లలోనూ అస్థిరత నెలకొంది. పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్ రాబడులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఆయా లోహాలు కొత్త గరిష్టాలను నమోదు చేయలేకపోతున్నాయి. స్వల్పంగా తగ్గుదల అనంతరం పెట్టుబడిదారులు పెట్టుబడుతున్నారు. ధరలు కాస్త పెరగ్గానే లాభాలను స్వీకరిస్తున్నారు. దీంతో బులియన్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయితే ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో శనివారం ఔన్స్ బంగారం ధర 0.89 శాతం తగ్గి 4,139 డాలర్లకు చేరగా, వెండి ధర 1.02 శాతం తగ్గి 60 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్లకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో ట్రేడింగ్ జరగలేదు. దీంతో అంతకు ముందు ముగింపు వద్దే ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1354 పాయింట్ల పెరుగుదలతో 1,50,390 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,171 పాయింట్లు పెరిగి 2,25,877 వద్ద నిలిచింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,918 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,344 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,180 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,91,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.11,000 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,675 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,400గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,67,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,189 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,512గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,11,890గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,200 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026

Gold Prices | సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. దీపావళి సీజన్ కలిసొచ్చేనా..?
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి
- ●Nightclub | దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు



