త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jason Sanjay | సిగ్మా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – తెల్ల‌కాగితం కంటే ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు మూవీకి త‌క్కువ వ‌సూళ్లు

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సిగ్మా మూవీ మొద‌టిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో క‌లిపి శుక్ర‌వారం రోజు ఈ సినిమాకు కేవ‌లం రెండు కోట్ల న‌ల‌భై మూడు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. తెలుగు వెర్ష‌న్ కోటి మార్కును కూడా ట‌చ్ చేయ‌లేక‌పోవ‌డం బాక్సాఫీస్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రుస్తోంది.

N

Entertainment | Published On Oct 3, 2026, 11.38 am IST

Jason Sanjay | సిగ్మా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – తెల్ల‌కాగితం కంటే ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు మూవీకి త‌క్కువ వ‌సూళ్లు
Advertisement

Jason Sanjay |త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ సిగ్మా మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో శుక్ర‌వారం రిలీజైంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది.

రికార్డులు అనుకుంటే....

ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌, క్రేజ్ కార‌ణంగా ఆరంభం నుంచే ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చిరంజీవితో పాటు ప‌లువురు అగ్ర హీరోలు ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం, సోష‌ల్ మీడియా ద్వారా సినిమాకు స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో తొలిరోజు సిగ్మా భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి. రికార్డులు అనుకుంటే సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది.

నెగెటివ్ టాక్‌....

ప్రీమియ‌ర్స్ నుంచే సిగ్మా సినిమాకు నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ ఎఫెక్ట్ క‌లెక్ష‌న్స్‌పై ప‌డింది. తెలుగులో కోటి మార్కును కూడా ట‌చ్ చేయ‌లేక‌పోయింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఓవ‌రాల్‌గా మొద‌టిరోజు రెండు కోట్ల న‌ల‌భై మూడు ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను ఈ మూవీ రాబ‌ట్టింది. త‌మిళ వెర్ష‌న్‌కు కోటి న‌ల‌భై తొమ్మిది ల‌క్ష‌లు రాగా...తెలుగులో 92 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం రిలీజైన తెల్ల‌కాగితం, డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ కంటే సిగ్మా మూవీకి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రావ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది.

నెగెటివ్ కామెంట్స్‌...

క‌థ‌తో పాటు డైరెక్ట‌ర్‌గా జాస‌న్ సంజ‌య్ టేకింగ్‌లో కొత్త‌ద‌నం లేదంటూ సిగ్మా మూవీపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ మ‌నీ హీస్ట్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించాడంటూ చెబుతున్నారు. సిగ్మా సినిమాలో కేథ‌రిన్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

 

Advertisement
Advertisement