త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మ‌హిళా ఎమ్మెల్యేల‌పై పోలీసుల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. బీఆర్ఎస్ కీల‌క నిర్ణ‌యం!

BRS | అసెంబ్లీ స‌మావేశాల మొద‌టి రోజు ఎదురైన ప‌రిణామ‌ల‌పై బీఆర్ఎస్ (BRS) పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎమ్మెల్యేల ప‌ట్ల పోలీసుల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌పై జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Sep 10, 2026, 11.38 am IST

BRS | మ‌హిళా ఎమ్మెల్యేల‌పై పోలీసుల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. బీఆర్ఎస్ కీల‌క నిర్ణ‌యం!
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాల మొద‌టి రోజు ఎదురైన ప‌రిణామ‌ల‌పై బీఆర్ఎస్ (BRS) పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎమ్మెల్యేల ప‌ట్ల పోలీసుల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌పై జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించింది. పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ అసెంబ్లీ సమావేశాల సెషన్‌ నుంచి 22 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈనేప‌థ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు.

అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్‌ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. దాని ఘ‌ట‌న‌కు సంబంధించి ప్రభుత్వం విడుద‌ల‌ చేసిన ఫొటోలు నకిలీవంటూ ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు స‌మాచారం.

Advertisement
Advertisement