Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
Narsingi | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో (Narsingi) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌షాకోట్ వద్ద రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు అదుపుతప్పి ఓ జవాన్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
Narsingi | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో (Narsingi) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌షాకోట్ (Hydershakote) వద్ద రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు అదుపుతప్పి ఓ జవాన్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
రాంగ్‌రూట్‌లో అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందుగా ఓ ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టింది. అయినప్పటికీ ఆగకుండానే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరికొందరిని కూడా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తున్నది. వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారుతోపాటు అందులో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- ●FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు
- ●Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన సర్ఫులు, సబ్బుల ధరలు
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..
- ●PM Modi | 25 ఏళ్ల ప్రజాప్రస్థానం.. వినాయకుడికి ప్రధాని ప్రత్యేక పూజలు
- ●Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..
- ●Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు

Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన సర్ఫులు, సబ్బుల ధరలు

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..

PM Modi | 25 ఏళ్ల ప్రజాప్రస్థానం.. వినాయకుడికి ప్రధాని ప్రత్యేక పూజలు






