Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న. ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు గత రెండు సెషన్‌లలో లాభాలను నమోదు చేసినప్పటికీ ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో ఉండడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న. ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు గత రెండు సెషన్‌లలో లాభాలను నమోదు చేసినప్పటికీ ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో ఉండడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో బుధవారం సెషన్‌లోనూ అనేక షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇక బులియన్ మార్కెట్లు సైతం దాదాపు ఇదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఈ సెషన్‌లో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.75 శాతం తగ్గి 4,132 డాలర్లకు చేరగా, వెండి ధర 1.08 శాతం తగ్గి 60 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 765 పాయింట్లు క్షీణించి 1,49,355 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1617 పాయింట్లు తగ్గి 2,25,625 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,957 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,656 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,95,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6,500 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,710 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,71,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,218 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,744గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,21,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
అక్టోబర్ 6, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
అక్టోబర్ 5, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..
- ●Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు
- ●Hit and Run | బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన లారీ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
- ●Drone Attack | నల్లసముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. సిబ్బంది అంతా భారతీయులే
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో ఈ నెల 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లారో ఇక అంతే..!
- ●TGSRTC | భారీగా తగ్గిన ఏసీ బస్సు చార్జీలు.. నేటి నుంచే అమల్లోకి

Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..

Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

Hit and Run | బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన లారీ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Drone Attack | నల్లసముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. సిబ్బంది అంతా భారతీయులే



