త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన స‌ర్ఫులు, స‌బ్బుల ధ‌ర‌లు

Detergent Prices Hike | దేశంలో అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ క‌న్సూమ‌ర్ గూడ్స్ (FMCG) దిగ్గ‌జం హిందుస్థాన్ యూనిలివ‌ర్ లిమిటెడ్ (HUL) మారోసారి సామాన్యుల‌కు షాక్ ఇంచ్చింది. డిటర్జెంట్ విభాగంలోని వీల్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ బ్రాండ్ల ధరలను (Detergent Prices Hike) భారీగా పెంచింది.

G

Business | Published On Oct 7, 2026, 11.11 am IST

Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన స‌ర్ఫులు, స‌బ్బుల ధ‌ర‌లు
Advertisement

Detergent Prices Hike | త్రినేత్ర న్యూస్‌: దేశంలో అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ క‌న్సూమ‌ర్ గూడ్స్ (FMCG) దిగ్గ‌జం హిందుస్థాన్ యూనిలివ‌ర్ లిమిటెడ్ (HUL) మారోసారి సామాన్యుల‌కు షాక్ ఇంచ్చింది. డిటర్జెంట్ విభాగంలోని వీల్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ బ్రాండ్ల ధరలను (Detergent Prices Hike) భారీగా పెంచింది. స‌బ్బులు, డిట‌ర్జెట్ల‌పై 2.2 శాతం నుంచి 7.1 శాతం వరకు పెంచింది. వీల్‌, స‌ర్ఫ్ ఎక్సెల్ ఈజీవాష్‌, స‌ర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్‌, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ బార్, సర్ఫ్ ఎక్సెల్ బార్ బండిల్, రిన్ పౌడర్, రిన్ ఆలా వంటి ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను ఒక్క‌సారిగా పెంచింది. దీంతో ఈ ఏడాదిలో పలు ఉత్పత్తుల ధరలను పెంచడం రెండు నుంచి నాలుగుసార్లు కావ‌డం గ‌మ‌నార్హం.

హెచ్‌యూఎల్ మాస్, బ‌డ్జెట్ సెగ్మెంట్ బ్రాండ్ అయిన వీల్ 1 కేజీ పౌడర్ ధ‌ర‌ను రూ. 90 నుంచి రూ. 93కి పెంచింది. అదేవిధంగా రూ. 46గా ఉన్న‌ 500 గ్రాముల ప్యాక్ ధరరూ.47కి చేరింది (2.2 శాతం). వీల్ పౌడర్ ధరలను ఈ ఏడాది పెంచడం ఇది రెండోసారి. మే నెలలో 1 కేజీ ప్యాక్ ధర రూ.83గా ఉండగా, ఆ తర్వాత దాన్ని రూ. 90 కి పెంచారు. తాజా పెంపుతో అది రూ.93కి చేరింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు కేజీ వీల్ పౌడర్ ధర మొత్తంగా రూ.10 (12 శాతం) మేర పెరిగింది.

మ‌రోవైపు ప్రీమియం విభాగంలోని సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ధ‌ర‌ల‌ను కూడా పెంచింది. రూ.167గా ఉన్న కేజీ ప్యాక్ ధ‌ర రూ.172కి పెరిగింది. ఈ ఏడాదిలో ధర పెర‌గ‌డం ఇది నాలుగోసారి. జనవరిలో రూ.162గా ఉన్న ధ‌ర‌.. ఆ త‌ర్వాత రూ.165కి, అనంత‌రం రూ.167కి, తాజాగా రూ.172 కి చేరింది. అంటే జ‌న‌వ‌రిలో నుంచి ఇప్పటివరకు రూ. 10 అధిక‌మైంది. అదేవిధంగా సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 500 గ్రాములు ధ‌ర రూ.85 నుంచి రూ.87కి చేరింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.76 ఉండ‌గా, అనంత‌రం రూ.79 కి, ఆ త‌ర్వాత‌ రూ.81, రూ.85, ప్ర‌స్తుతం రూ.87కి పెరిగింది. మొత్తంగా రూ.11 వినియోగ‌దారుల‌పై భారం మోపింది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ 1 కేజీ ధ‌ర‌ రూ.235 నుంచి రూ. 245కు (4.3 శాతం పెరుగుదల), 500 గ్రాముల ధ‌ర రూ.118 నుండి రూ.123కి (4.2 శాతం పెరుగుదల) చేరింది.

ఇక సర్ఫ్ ఎక్సెల్ స‌బ్బుల (డిటర్జెంట్ బార్) ధ‌ర‌ల‌ను కూడా పెంచింది. గతంలో రూ.42గా ఉన్న 250 గ్రాముల సబ్బు ధ‌ర 7.1 శాతం పెరిగి రూ.45కి చేరింది. అలాగే, 4 స‌బ్బులు ఉండే బండిల్ (200 గ్రాముల‌) ప్యాక్ ధర రూ.145 నుంచి రూ. 155కి పెరిగింది. సర్ఫ్ ఎక్సెల్ స‌బ్బుల‌ ధరలను పెంచ‌డం ఈ ఏడాది ఇది మూడోసారి కావ‌డం గ‌మ‌నార్హం.

రిన్ పౌడ‌ర్ కూడా..

మాస్‌, ప్రీమియం విభాగంలోని రిన్ బ్రాండ్ ఉత్పత్తుల ధ‌ర‌ల‌ను కూడా హెచ్‌యూఎల్ స‌వ‌రించింది. రిన్ అలా (Rin Ala) 500 ఎంఎల్ ప్యాక్ ధ‌ర రూ.90 నుంచి రూ.95కి పెరిగింది. దీని ధర పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ఒకేసారి రూ.5 మేర భారం ప‌డింది. ఇక కేజీ రిన్ పౌడర్ ధర రూ.3 పెరిగి రూ.123కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇది రూ.120గా ఉంది. ఈ ఏడాది జూలై వ‌ర‌కు రూ.117గా ఉండ‌గా రూ.120 పెంచారు. తాజా పెంపుతో కేజీ ప్యాకెట్‌పై ఈ ఏడాది రూ.6 భారం ప‌డింది. అదేవిధంగా 500 గ్రాముల ప్యాక్ ధర రూ.61 నుంచి రూ.63కు చేరుకుంది.

కార‌ణం ఏంటంటే..

హెచ్‌యూఎల్ మొత్తం ఆదాయంలో డిటర్జెంట్, లాండ్రీ విభాగం వాటా 25 శాతం నుంచి 30 శాతం వరకు ఉంటుంది. మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్త‌తలు, అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో పామాయిల్ వంటి ముడిసరుకుల వ్యయాలు 20 నుంచి 30 శాతం మేర పెరిగాయ‌ని, వాటిని భర్తీ చేసేందుకు ఏప్రిల్ నుంచి దశలవారీగా ఉత్ప‌త్తుల ధరలను పెంచుకుంటూ వస్తున్న‌ది. తాజా పెంపుతో సామాన్యుడి బడ్జెట్‌పై మరింత భారం పడనుంది.

Advertisement
Advertisement