ACB Raids | మొయినాబాద్ మున్సిపాల్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Raids | వరుసగా దాడులు నిర్వహిస్తూ ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) వణుకుపుట్టిస్తున్నది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి ఇంట్లో సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు.
ACB Raids | త్రినేత్ర న్యూస్: వరుసగా దాడులు నిర్వహిస్తూ ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) వణుకుపుట్టిస్తున్నది. గతవారం నాగర్‌కర్నూలు జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) సత్యనారాయణ గౌడ్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ (Moinabad Municipality) టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి (Gundu Vani) ఇంట్లో సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అత్తాపూర్‌లోని వాణి (Town planning officer) నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్‌లో పని చేస్తూ పెద్దఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, సెప్టెంబర్ 30న లంచం తీసుకుంటూ వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి రూ.75 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వాణి తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు సుదర్శన్ పట్టుబడ్డాడు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో భాగంగానే వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Irrigation DEE | ఆదాయానికి మించిన ఆస్తులు.. ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ అరెస్ట్.. 14 రోజులు రిమాండ్
నవంబర్ 13, 2026

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ డీఈ.. ఎలా దొరికాడంటే!
నవంబర్ 10, 2026

NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!



