త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువ‌కుడు మృతి

Road Accident | జిమ్( Gym ) నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ యువ‌కుడిని గ్యాస్ లారీ( Gas Lorry ) ఢీకొట్టి ప్రాణాలు బ‌లి తీసుకుంది. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా( Medchal District ) కీస‌ర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రాంప‌ల్లి( Rampally ) చౌర‌స్తా ద‌గ్గ‌ర శ‌నివారం ఉద‌యం చోటు చేసుకుంది.

S

Hyderabad | Published On Oct 10, 2026, 5.40 pm IST

Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువ‌కుడు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్ : జిమ్( Gym ) నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ యువ‌కుడిని గ్యాస్ లారీ( Gas Lorry ) ఢీకొట్టి ప్రాణాలు బ‌లి తీసుకుంది. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా( Medchal District ) కీస‌ర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రాంప‌ల్లి( Rampally ) చౌర‌స్తా ద‌గ్గ‌ర శ‌నివారం ఉద‌యం చోటు చేసుకుంది.

నాగారం ప్రాంతానికి చెందిన అఖిల్‌(20) ఉదయం జిమ్‌ ముగించుకుని తన ఇంటికి వెళ్తుండగా.. నాగారం నుంచి అహ్మద్‌గూడ వైపు వెళ్తున్న గ్యాస్‌ లారీ ప్రమాదవశాత్తు అత‌డిని ఢీకొట్టింది. ఆ త‌ర్వాత అఖిల్‌పై నుంచి దూసుకెళ్ల‌డంతో.. అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న త‌ల్లి ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని గుండెల‌విసేలా రోదించింది. చిన్న వయసులోనే కొడుకు మృత్యువాత పడటంతో అఖిల్ తల్లి బోరున విలపించిన‌ తీరు అంద‌ర్నీ క‌లిచివేసింది. అఖిల్‌ శివానందపురి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఈ ప్ర‌మాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

Advertisement
Advertisement