త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Year Celebrations | న్యూ ఇయ‌ర్‌ వేడుక‌ల్లో అప‌శృతి.. ఫుడ్‌పాయిజ‌న్‌తో ఒక‌రి మృతి

New Year Celebrations | నూత‌న సంవ‌త్స‌ర వేడుకల్లో (New Year Celebrations) అప‌శృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజ‌న్‌ (Food Poison) తో ఒకరు మృతి చెంద‌గా, 13 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మేడ్చ‌ల్ జిల్లా జ‌గ‌ద్‌గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని భ‌వానీన‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

A

Hyderabad | Published On Jan 1, 2026, 2.54 pm IST

New Year Celebrations | న్యూ ఇయ‌ర్‌ వేడుక‌ల్లో అప‌శృతి.. ఫుడ్‌పాయిజ‌న్‌తో ఒక‌రి మృతి
Advertisement

New Year Celebrations | నూత‌న సంవ‌త్స‌ర వేడుకల్లో (New Year Celebrations) అప‌శృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజ‌న్‌ (Food Poison) తో ఒకరు మృతి చెంద‌గా, 13 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మేడ్చ‌ల్ జిల్లా జ‌గ‌ద్‌గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని భ‌వానీన‌గ‌ర్‌లో న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ప‌ద్నాలుగు మంది స్నేహితులు క‌లిసి పార్టీ చేసుకున్నారు. మ‌ద్యం సేవించి, రోటీతో క‌లిసి చికెన్‌, ఫిష్ తిని వేడుక‌లు జ‌రుపుకున్నారు. అనంత‌రం అంద‌రూ ఒక్క‌సారిగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని చికిత్స‌నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ పాండు (53) మృతి చెందాడు. మిగిలిన వారికి వైద్యుల ఇంకా చికిత్స కొన‌సాగుతోంది. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆహారం, మ‌ద్యం న‌మూనాలు సేక‌రించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement