Road Accident | హయత్ నగర్‌లో ఘోర ప్రమాదం.. ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Road Accident | హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా, ఆమె తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Road Accident | హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా, ఆమె తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు.
సోమవారం ఉదయం ఆర్టీసీ కాలనీ వద్ద తండ్రి యంసాని పాండుతో కలిసి ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య రోడ్డు దాటేందుకు యత్నించారు. అదే సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు తండ్రి, కుమార్తెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న తండ్రిని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐశ్వర్య మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె మృతితో మెడికల్ కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నారు. తోటి స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. కళాశాల యాజమాన్యం ప్రగాఢ సానుభూతి తెలిపింది.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్వర్క్పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



