త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cab Driver | దారిమ‌ళ్లించి.. నిర్మానుష్య ప్రాంతంలో.. ప్ర‌యాణికురాలిపై క్యాబ్ డ్రైవ‌ర్ లైంగిక దాడికి య‌త్నం

Cab Driver | హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో దారుణం చోటుచేసుకున్న‌ది. శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టుకి క్యాబ్‌లో వెళ్తున్న ఓ మ‌హిళ‌పై డ్రైవ‌ర్ (Cab Driver) లైంగిక దాడికి య‌త్నించాడు.

G

Hyderabad | Published On Sep 28, 2026, 9.38 am IST

Cab Driver | దారిమ‌ళ్లించి.. నిర్మానుష్య ప్రాంతంలో.. ప్ర‌యాణికురాలిపై క్యాబ్ డ్రైవ‌ర్ లైంగిక దాడికి య‌త్నం
Advertisement

Cab Driver | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో దారుణం చోటుచేసుకున్న‌ది. శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టుకి క్యాబ్‌లో వెళ్తున్న ఓ మ‌హిళ‌పై డ్రైవ‌ర్ (Cab Driver) లైంగిక దాడికి య‌త్నించాడు. అర‌వ‌డంతో ఆమె వ‌ద్ద ఉన్న బ్యాగును తీసుకుని ప‌రారైన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌లోని శివాజీన‌గ‌ర్ చెందిన మ‌హిళ (38) శంషాబాద్ విమానాశ్రయానికి (Airport) క్యాబ్‌లో బ‌య‌ల్దేరింది. తుండుప‌ల్లి టోల్ ప్లాజా వ‌ద్ద క్యాబ్‌ను దారిమ‌ళ్లించాడు. ఓఆర్ఆర్ (ORR) మీదుగా కాకుండా స‌ర్వీస్ మీదుగా తీసుకెళ్లాడు. కారులోనే ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. భయాందోళ‌న‌ల‌కు గురైన బాధితురాలు క్యాబ్ దిగి కేక‌లు వేసింది. దీంతో భయపడిన క్యాబ్ డ్రైవర్ ఆమె వ‌ద్ద రూ.60 వేల న‌గ‌దుతో ఉన్న‌ బ్యాగును లాక్కొని ప‌రార‌య్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప‌రారీలో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ కోసం ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నారు.

Advertisement
Advertisement