Auto Strike | సమ్మెకు వెళ్తున్నాం.. సహకరించండి.. రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన చేపడతాం
Auto Strike | నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని.. రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ ప్రదర్శన చేపడతామన్నారు.
- జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తాం
- రేపటి సమ్మెను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి.. వారి మాటలు నమ్మొద్దు
- సంక్షేమ బోర్డు, రూ.12 వేలని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది
- ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఫైర్
Auto Strike | త్రినేత్ర.న్యూస్: నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని.. రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ ప్రదర్శన చేపడతామన్నారు. ఈ సమ్మెపై తప్పుదోవ పట్టించే సంఘాల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమాను ఎత్తేశారని విమర్శించారు. ప్రభుత్వమే ఆన్‌లైన్ యాప్‌ను తెచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశ అనంతరం మీడియా ప్రతినిధులతో వేముల మారయ్య మాట్లాడారు.
బీఆర్ఎస్ తెచ్చిన 5 లక్షల ప్రమాద బీమాను ఎత్తేశారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఏడాదికి 12 వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని మోసం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 5 లక్షల ప్రమాద బీమా ఎత్తేసింది.
ప్రభుత్వమే ప్రత్యేక ఆన్‌లైన్ యాప్ తెచ్చి ఆదుకోవాలి
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేయాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ రేపటి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే ప్రత్యేక ఆన్‌లైన్ యాప్ తెచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రేపటి సమ్మెను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. దయచేసి ఆటో డ్రైవర్లు ఎవరు ఆ సంఘాల మాటలు నమ్మకండి. ఆటో డ్రైవర్లు రేపటి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి అని వేముల మారయ్య పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
- ●Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్
- ●TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
- ●Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్
- ●Toxic Pre-release Event Accident | యశ్ 'టాక్సిక్' ఈవెంట్లో ప్రమాదం.. స్పీకర్ స్టాండ్ కూలి నలుగురికి గాయాలు.. నిర్వాహకులపై కేసు!
- ●Nyepi Festival Bali | బాలిలో హిందూ పండుగను అవమానించిన విదేశీ టూరిస్ట్.. ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు!

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!

Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్

TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్






