Venus constellation Transit | పూర్వ భాద్రపద నక్షతంలోకి శుక్రుడు.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్..!
Venus constellation Transit | వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, ఆకర్షణ, కళ, శ్రేయస్సుకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడు తన రాశి, నక్షత్రాన్ని మార్చుకున్న సమయంలో ఆ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ఒక్కోరాశిపై ఒక్కో విధమైన ప్రభావం చూపిస్తాడు. ప్రస్తుతం రాక్షసగురువు భాద్రపద నక్షత్రంలోకి మారాడు.
Venus constellation Transit | వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, ఆకర్షణ, కళ, శ్రేయస్సుకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడు తన రాశి, నక్షత్రాన్ని మార్చుకున్న సమయంలో ఆ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ఒక్కోరాశిపై ఒక్కో విధమైన ప్రభావం చూపిస్తాడు. ప్రస్తుతం రాక్షసగురువు భాద్రపద నక్షత్రంలోకి మారాడు. జ్యోతిషశాస్త్రం పరంగా కీలకమైన ఘనటగా పండితులు పేర్కొంటున్నారు. పూర్వ భాద్రపద నక్షత్రం ఆధ్యాత్మికత, జీవితంలో తీవ్రమైన మార్పులను కలుగజేస్తుంది. దాంతో ఆ శుక్రుడు ఆ నక్షత్రంలో సంచరించిన సమయంలో అది ప్రేమబంధాల్లో మాధుర్యం, ఆర్థికపరమైన విషయాల్లో మెరుగుదల ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో పురోగతికి అవకాశాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మానసిక శాంతి, జీవనశైలిలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా నాలుగురాశుల వారికి ఈ సంచారం కారణంగా లాభం, పురోగతికి అవకాశాలున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈ శుక్రగ్రహం సంచారంతో ప్రేమ, కుటుంబ సంబంధాలు మరింత బలపడుతాయి. ఈ సమయంలో సామరస్యం, అవగాహన పెరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావొచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కళలు, సంగీతం, సృజనాత్మక కార్యకలాపాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఆయా రంగాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వృత్తిపరమైన విషయాలపై ఆలోచనాత్మకమైన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సోషల్ నెట్‌వర్కింగ్, కొత్త పరిచయాలతో మీకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో యోగా, ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక జాతకులకు పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడి సంచారంతో ఆర్థికంగా, వృత్తిపరమైన అంశాల్లో శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ ఊపందుకుంటాయి. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. సంబంధాలలో ఆకర్షణ, ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ప్రయాణం, విద్యలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో స్వావలంబన కోసం చేసే ప్రయత్నాలు ఫలమవంతమవుతాయి. వివాదాలను పక్కన పెట్టి కొత్త ముందుకు వెళ్లడం మంచిది. పెట్టుబడులు, పొదుపులపై దృష్టి సారించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్యారాశి..
ఈ సంచారం సమయంలో కన్యారాశి వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. భయాలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రేమ బంధాలు మరింత మధురంగా మారుతాయి. ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్న వారు తీసుకునే నిర్ణయాలతో సానుకూల ఫలితాలుంటాయి. పెట్టుబడులతో లాభాలు ఆర్జిస్తారు. సృజనాత్మకతో జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. కుటుంబం, పిల్లలతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుంభం
శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశి వారికి ప్రయోజనాలుంటాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి. గతంలోని విభేదాలు, ఉద్రిక్తతలన్నీ తగ్గిపోతాయి. ప్రేమ సంబంధాల్లో ఉత్సాహకరంగా ఉంటాయి. కెరీర్‌లో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్య, కళలు, సృజనాత్మక కార్యకలాపాల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైన భాగస్వామ్యాలు, సహాయ సహకారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మానసిక స్పష్టత, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి. దాంతో సులభంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనూ ప్రయోజనాలుంటాయి. సానుకూల శక్తితో ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం.
Read Also :
Mars Transit | కుంభరాశిలో కుజుడి సంచారంతో పంచగ్రహి యోగం.. ఈ రాశుల వారి ప్రమోషన్లు, జీతం పెరిగే ఛాన్స్..!
Budh Asta | కుంభరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






