Mars Transit | కుంభరాశిలో కుజుడి సంచారంతో పంచగ్రహి యోగం.. ఈ రాశుల వారి ప్రమోషన్లు, జీతం పెరిగే ఛాన్స్..!
Mars Transit | కుజుడు ఇటీవల కుంభరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు శనిరాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఇది అరుదైన ఐదుగ్రహాల సంయోగాన్ని సృష్టించనున్నది. ఈ పంచగ్రహి యోగంలో మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని సాధారణంగా సవాలుగా భావిస్తున్నారు. కానీ, సున్నితమైన గ్రహాల సంచారం, బృహస్పతి శుభ దృష్టి ఈ యోగాన్ని ప్రయోజనకరంగా మారుస్తాయి.
Mars Transit | కుజుడు ఇటీవల కుంభరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు శనిరాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఇది అరుదైన ఐదుగ్రహాల సంయోగాన్ని సృష్టించనున్నది. ఈ పంచగ్రహి యోగంలో మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని సాధారణంగా సవాలుగా భావిస్తున్నారు. కానీ, సున్నితమైన గ్రహాల సంచారం, బృహస్పతి శుభ దృష్టి ఈ యోగాన్ని ప్రయోజనకరంగా మారుస్తాయి. అందుకే ఈ సంచారం అనేక రాశులవారికి అదృష్టాన్ని తీసుకురానున్నది. ఈ కుజగ్రహ సంచారం ముఖ్యంగా మేషం సహా ఐదు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనున్నది. ఈ సమయంలో ఆయారాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థికం, వ్యక్తిగత సంబంధాలు జీవితంలోని వివిధ రంగాల్లో సానుకూల మార్పులుంటాయి. గ్రహాలకు అనుకూలమైన కలయిక ప్రయత్నాలను పెంచడమే కాకుండా అనేక సందర్భాల్లో కావాల్సిన ఫలితాలు సులభంగా పొందుతారు. కుజుడు ఈ స్థానం రాశులవారికి కొత్త అవకాశాలు, విజయానికి ద్వారాలు తెరుచుకోనున్నాయి.
మేషం
మేషం రాశి 11వ ఇంట్లో కుడుజు సంచరించరిస్తున్నాడు. ఈ సమయం కెరీర్‌లో చాలా అవకాశాలు, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారు కొత్త అవకాశాలు, బాధ్యతలు పొందుతారు. మునుపటి అనుభవం, కష్టపడి పని చేయడం వల్ల ప్రమోషన్‌తో పాటు వేతనం పెరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు సైతం ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అయితే, ఖర్చులు, పొదుపుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది.
మిథునరాశి
కుజుడు సంచారం మిథునరాశి తొమ్మిదో ఇంట్లో జరుగుతోంది.. ఈ సమయంలో మీరు మిశ్రమ అనుభవాలను అనుభవిస్తారు. కెరీర్ లాభాలు సాధ్యమవుతాయి. కానీ, వేగం ఆశించిన విధంగా ఉండదు. విదేశీ పని, ఉద్యోగంలో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ప్రమోషన్లు నెమ్మదిగా ఉండవచ్చు. పరిమిత వ్యాపార లాభాలు సాధిస్తారు. ఆర్థిక అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ఖర్చులు జరిగే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహరాశి వారికి కుజుడు వారి ఏడో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు, సహోద్యోగులతో మంచి సంబంధాలుంటాయి. కెరీర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈ కాలంలో అధిక లాభాలను ఆశిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. సంబంధాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.
కన్యారాశి
కన్యారాశి వారికి అంగారక గ్రహం ఆరో ఇంట్లో సంచారం జరుగుతోంది. ఈ కాలంలో కెరీర్‌లో పురోగతి సాధ్యమవుతుంది. విదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. పనిలో సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో పాల్గొన్న వారు సంతృప్తికరమైన లాభాలను చూస్తారు. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది.
ధనుస్సు..
ధనుస్సు రాశి వారికి మూడో ఇంట్లో కుజుడు కుంభరాశిలో సంచరించడంతో మిశ్రమ ఫలితాలుంటాయి. కెరీర్‌లో విజయం, ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు, జీతం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు అధిక లాభాలు సంపాదించే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యాపారాల నుంచి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. పిల్లల ఆరోగ్యంపై కొత్త జాగ్రత్త వహించాలి.
తాజావార్తలు
- ●Seethakka | చిన్నారులున్న చోటుకే మొబైల్ అంగన్వాడి కేంద్రాలు
- ●Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ●Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? - విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !
- ●Konda Surekha | కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. కడియంపై హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
- ●Harsh Goenka | మీ జీవితాన్ని మార్చే 3-30-300 రూల్.. హర్ష్ గోయెంకా చెప్పిన సక్సెస్ సీక్రెట్..
- ●Mahesh Kumar Goud | కేటీఆర్.. మరి తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు..?

Seethakka | చిన్నారులున్న చోటుకే మొబైల్ అంగన్వాడి కేంద్రాలు

Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? - విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !

Konda Surekha | కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. కడియంపై హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు






