Budh Asta | కుంభరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!
Budh Asta | బుధుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలోనే ఇదే రాశిలో అస్తమించబోతున్నాడు. బుధుడు నేడు (ఫిబ్రవరి 28న) రాత్రి 10.09 గంటలకు తిరోగమన స్థితిలో అస్తమిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. మార్చి 13 వరకు ఇదే స్థితిలో ఉంటాడు.
Budh Asta | బుధుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలోనే ఇదే రాశిలో అస్తమించబోతున్నాడు. బుధుడు నేడు (ఫిబ్రవరి 28న) రాత్రి 10.09 గంటలకు తిరోగమన స్థితిలో అస్తమిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. మార్చి 13 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. బుధుడు తెలివితేటలు, వాక్కు, కమ్యూనికేషన్, తార్కిక శక్తి, వ్యాపారానికి కారకుడిగా చెబుతారు. ఈ గ్రహం అస్తమయం సమయంలో పలురాశులవారిపై శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉన్నది. ఆర్థికంగా లాభాలను చూస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆశించిన మేరకు లాభాలను ఆర్జిస్తారు. ఇంతకీ ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందాం..!
తులరాశి..
తులరాశి ఐదో ఇంట్లో బుధుడు అస్తమిస్తాడు. దాంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా లాభం జరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ సమయంలో సృజనాత్మకరంగంలో ఉన్న వారు శుభవార్తలను అందుకుంటారు. విద్య, మేనేజ్‌మెంట్ రంగాల్లోని వ్యక్తులు విజయాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంతో భవిష్యత్‌లో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభరాశి..
ఈ సమయం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు లగ్నంలో అస్తమించనున్నాడు. వ్యక్తిత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. మీ కృషికి దగ్గ ఫలితం దక్కే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఆర్థికంగా లాభాలుంటాయి. అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి.
మీన రాశి
ఈ సమయం మీన రాశి వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. మీ జీవితంలో కీలకమైన మార్పులు చూస్తారు. మీరు పనిచేసే చోట కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలతో ప్రయోజనాలను పొందుతారు. పాత పనులను సమీక్షించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వివాహితులకు వారి అత్తమామల నుంచి పూర్తి సహాయ సహకారాలు, మద్దతు లభిస్తుంది.
Read Also :
Mars Transit | కుంభరాశిలో కుజుడి సంచారంతో పంచగ్రహి యోగం.. ఈ రాశుల వారి ప్రమోషన్లు, జీతం పెరిగే ఛాన్స్..!
Gajakesari Yogam | పవర్‌ఫుల్ గజకేసరి యోగం.. ఈ మూడురాశుల వారి జాతకాలే మారబోతున్నయ్..!
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి




