Brain Health | జంక్ ఫుడ్ తింటే మతిమరుపుకు ఆహ్వానం పలికినట్లే.. జ్ఞాపకశక్తి బాగా తగ్గుతుంది..
Brain Health | అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) మన ఆరోగ్యంపై కలిగించే ప్రభావం గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్నప్పటికీ, తాజాగా వెలువడిన అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగంగా తగ్గిపోవడం, డిమెన్షియా ప్రమాదం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు వెల్లడించారు.
Brain Health | అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) మన ఆరోగ్యంపై కలిగించే ప్రభావం గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్నప్పటికీ, తాజాగా వెలువడిన అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగంగా తగ్గిపోవడం, డిమెన్షియా ప్రమాదం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు వెల్లడించారు. అలాగే యూపీఎఫ్ లను తీసుకునే పరిమాణం కొద్దిగా పెరిగినా దృష్టి కేంద్రీకరణ (అటెన్షన్), ఫోకస్‌లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. మోనాష్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో, డీకిన్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనాన్ని అల్జీమర్స్ అండ్ డిమెన్షియా: డయాగ్నోసిస్, అసెస్‌మెంట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా డిమెన్షియా లేని 2,100 మందికి పైగా మధ్య వయస్సు కలిగిన, వృద్ధ ఆస్ట్రేలియన్ వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే..
పరిశోధనలో తేలిన విషయాల ప్రకారం యూపీఎఫ్ ల వినియోగం కేవలం స్వల్పంగా పెరిగినా అటెన్షన్ తగ్గిందని వెల్లడైంది. మొత్తం డైట్ క్వాలిటీ ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రభావం కనిపించడం గమనార్హం. మోనాష్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బార్బరా కార్డోసో మాట్లాడుతూ రోజువారీ ఆహారంలో 10 శాతం యూపీఎఫ్ లు పెరగడం అంటే ఒక ప్యాకెట్ చిప్స్ జోడించినట్లేనని అన్నారు. ప్రతి 10 శాతం పెరుగుదలతో వ్యక్తుల దృష్టి కేంద్రీకరణ సామర్థ్యం కొలిచే పరీక్షల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించిందని తెలిపారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి పరిశ్రమల్లో అధిక ప్రాసెసింగ్‌కు గురయ్యే ఆహార పదార్థాలు. వీటిలో సహజ పోషకాలు తగ్గిపోతాయి, బదులుగా రసాయనాలు, చక్కెరలు, కొవ్వులు, ఉప్పు అధికంగా చేరుస్తారు. సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్ లు, సాసేజ్‌లు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ లాంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. ఈ ఫుడ్స్ సహజ నిర్మాణాన్ని కోల్పోవడంతోపాటు ఆర్టిఫిషియల్ పదార్థాలను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయని పరిశోధకులు పేర్కొన్నారు.
పెరుగుతున్న రిస్క్ స్కోర్..
2,192 మంది డిమెన్షియా లేని వ్యక్తుల డైట్, మెదడు పనితీరును విశ్లేషించిన ఈ అధ్యయనంలో యూపీఎఫ్ ల వినియోగం పెరిగిన కొద్దీ అటెన్షన్ సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు. అయితే జ్ఞాపకశక్తిపై ప్రభావం మాత్రం తక్కువగా కనిపించింది. యూపీఎఫ్ ల క్యాలరీలు ప్రతి 10 శాతం పెరిగినప్పుడు డిమెన్షియా రిస్క్ స్కోర్ 0.24 పాయింట్లు పెరిగినట్లు గుర్తించారు. ఇది మొత్తం డైట్ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కనిపించిన ప్రభావం కావడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెంచడం, జీర్ణాశయ పనితీరును దెబ్బతీయడం, రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇవన్నీ మెదడు పనితీరును దెబ్బతీసే అంశాలే. అలాగే ప్రాసెసింగ్ సమయంలో ఉపయోగించే రసాయనాలు మెదడుపై హానికర ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది.
నాచురల్ ఫుడ్స్‌ను తీసుకోవాలి..
2022లో బ్రెజిల్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా యూపీఎఫ్ ల వినియోగం అధికంగా ఉన్నవారిలో కాగ్నిటివ్ డిక్లైన్ (అభిజ్ఞా క్షీణత) 28 శాతం వరకు పెరిగినట్లు తేలింది. అయితే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యూపీఎఫ్ లను తగ్గించి సహజ ఆహారాలను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. చిప్స్‌కు బదులుగా నట్స్ లేదా పండ్లు, సోడా బదులుగా నీరు లేదా నిమ్మరసం, ప్యాకేజ్డ్ సిరియల్స్ బదులుగా ఓట్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ బదులుగా పప్పు దినుసులు, కూరగాయలు, స్వీట్స్ కు బదులుగా పెరుగు లేదా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని వారు తెలియజేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



