FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ప్రతిపాదన..
FSSAI | పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తుల ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లో పనీర్ అనే పదాన్ని ఇకపై ఉపయోగించకుండా నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
FSSAI | పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తుల ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లో పనీర్ అనే పదాన్ని ఇకపై ఉపయోగించకుండా నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం డెయిరీ కాంటెక్స్ట్‌లో అనలాగ్ విభాగంలో నమోదైన ఉత్పత్తులు కూడా ఈ ప్రతిపాదిత నిబంధనల పరిధిలోకి రానున్నాయి. ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, ఇలాంటి ఉత్పత్తులను వేరే పేరుతో విక్రయించడంతోపాటు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులకు కూడా కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందిన డెయిరీ అనలాగ్ ఉత్పత్తులు కూడా ముసాయిదా నిబంధనలు ఖరారైతే తమ ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కెటింగ్‌ను మార్చుకోవాల్సి వస్తుంది.
పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారైతే..
ప్రతిపాదిత మార్పుల ప్రకారం నిబంధనల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు ఇకపై పనీర్ అనే పదాన్ని ఉపయోగించకూడదు. వాటిని వేరే పేరుతో విక్రయించాల్సి ఉంటుంది. పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారైన ఉత్పత్తుల స్వభావం గురించి వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం అందించడమే ఈ మార్పుల ఉద్దేశంగా ప్రతిపాదన ద్వారా తెలుస్తోంది. ఈ ముసాయిదా ప్రతిపాదనపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రజలు, పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను కోరింది. ముసాయిదా నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. అందిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా ప్రతిపాదన మాత్రమే.. తుది నిబంధనగా అమల్లోకి రాలేదు. అయితే ఇది ఖరారైతే, ప్రస్తుతం డెయిరీ అనలాగ్‌లుగా వర్గీకరించిన ఉత్పత్తుల పేర్లు, లేబులింగ్, మార్కెటింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Nestle India | పసిపిల్లల పోషకాహార ఉత్పత్తుల్లో నిబంధనల ఉల్లంఘన.. నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్
సెప్టెంబర్ 18, 2026

FSSAI | ఫుడ్ ప్యాకెట్లపై “రెడ్” వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన
ఆగస్టు 29, 2026

Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం
- ●Tollywood | చంపుతామంటూ బెదిరింపులు - శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ భార్య కంప్లైంట్
- ●Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?
- ●Alimony Rules in India | మాజీ భార్యకు రెండో పెళ్లి అయితే.. మొదటి భర్త భరణం చెల్లించాల్సిందేనా? చట్టం ఏం చెబుతోంది?
- ●Mivi One 5G | రూ.11,999కే మివి వన్ 5జి.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో అదిరిపోయే ఫీచర్లు..
- ●BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం

Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం

Tollywood | చంపుతామంటూ బెదిరింపులు - శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ భార్య కంప్లైంట్

Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?

Alimony Rules in India | మాజీ భార్యకు రెండో పెళ్లి అయితే.. మొదటి భర్త భరణం చెల్లించాల్సిందేనా? చట్టం ఏం చెబుతోంది?



