FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
FSSAI | ప్రముఖ సంస్థలు నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్)కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థల ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు, లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది.
FSSAI | ప్రముఖ సంస్థలు నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్)కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థల ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు, లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది. మరోవైపు, తీవ్రమైన ఆహార భద్రతా లోపాల నేపథ్యంలో సుఖ్దర్శన్ ఫార్మా, బాలాజీ ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. ఇటీవల నిర్వహించిన తనిఖీలు, ఆడిట్లలో గుర్తించిన ఉల్లంఘనల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
నెస్కేఫ్ ఉత్పత్తులపై అభ్యంతరాలు
నెస్లే ఇండియాకు చెందిన ‘నెస్కేఫ్ ఇంటెన్స్ కేఫ్’ కాపుచినో ఫ్లేవర్, ‘నెస్కేఫ్ చోకో మోకా’, ‘నెస్కేఫ్ చిల్డ్ లాటే’ ఉత్పత్తుల విక్రయాలు, వాటికి సంబంధించిన ఆన్లైన్ ప్రకటనల్లో వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ష్రైబర్ డైనమిక్స్ డెయిరీస్, లోటస్ డెయిరీ ప్రొడక్ట్స్ తయారు చేసిన ఈ ఉత్పత్తుల ప్యాకెట్ల ముందు భాగంలో ‘ఫ్లేవర్డ్ మిల్క్’ అని పేర్కొనగా, వెనుకవైపు ‘ప్రొప్రైటరీ ఫుడ్ – 1.12 డెయిరీ బేస్డ్ డ్రింక్’ అని ముద్రించినట్లు తెలిపింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో వీటిని ‘కాఫీ ఫ్లేవర్డ్ మిల్క్’గా పేర్కొనడంతో పాటు, ‘ఫ్లేవర్డ్ డబుల్ టోన్డ్ మిల్క్ గుడ్నెస్తో తయారు చేసినవి’ వంటి వాదనలు చేసినట్లు వెల్లడించింది. ఉత్పత్తుల వాస్తవ కూర్పు, వర్గీకరణకు ఈ వివరణలు సరిపోవడం లేదని పేర్కొంది. ఉత్పత్తులు ‘ఫ్లేవర్డ్ మిల్క్స్’ కేటగిరీకి చెందినప్పటికీ, వాటిని ప్రొప్రైటరీ ఫుడ్‌గా ప్రకటించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ తరహా లేబులింగ్, ఉత్పత్తుల వివరణలు, ప్రకటనలు ఆహార భద్రతా ప్రమాణాల (ప్రకటనలు, క్లెయిమ్‌లు) నిబంధనలు–2018, (లేబులింగ్, ప్రదర్శన) నిబంధనలు–2020కు విరుద్ధమని పేర్కొంది.
అనుమతి అవసరమని స్పష్టం..
నెస్లేకు చెందిన ‘రెనల్ రిసోర్స్ వనిల్లా ఫ్లేవర్ పౌడర్’పై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉత్పత్తి లేబుల్, ప్రకటనలు, ఈ-కామర్స్ వేదికలపై అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించగా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలిపింది. ప్రత్యేక వైద్య పరిస్థితుల కోసం ఉద్దేశించిన ఈ ఉత్పత్తికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందస్తు అనుమతి అవసరమని, సంస్థ ఆ అనుమతి పొందలేదని పేర్కొంది.
హార్లిక్స్ ప్రకటనలపైనా అభ్యంతరాలు
హిందుస్థాన్ యూనిలీవర్‌కు చెందిన ‘హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ చాక్లెట్ న్యూట్రిషన్ డ్రింక్’, ‘హార్లిక్స్ మదర్స్ ప్లస్ కేసర్’ ఉత్పత్తులపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ రెండు నోటీసులు జారీ చేసింది. ‘ఎముకల బలానికి పోషణ’, ‘ఎముకల పటిష్టతను మెరుగుపరచడంలో వైద్యపరంగా నిరూపితమైంది’ వంటి వాదనలు నిబంధనలకు విరుద్ధంగా లేదా వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ఉత్పత్తిపై ‘హెల్తీ’ అనే పదం వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. పోషక విలువల వివరాలను నిర్దేశిత నమూనాలో ఇవ్వలేదని, ‘కాల్షియం, విటమిన్ డీ, కే2లకు 100 శాతం ఆర్డీఏ’ అనే వాదన కూడా ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించింది. హార్లిక్స్ మదర్స్ ప్లస్ కేసర్ ఉత్పత్తి ప్యాకెట్‌పై ‘ఆరోగ్యకరమైన జనన బరువు’, ప్రకటనల్లో ‘శిశువుకు ఆరోగ్యకరమైన జనన బరువు కోసం’ అనే వాదనలు కూడా తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొంది. ఇవి ఆహార భద్రతా ప్రమాణాల (ప్రకటనలు, క్లెయిమ్‌లు) నిబంధనలు–2018కు విరుద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
రెండు సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
తీవ్రమైన ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుద్ధ్య లోపాలను గుర్తించడంతో సుఖ్దర్శన్ ఫార్మా లైసెన్స్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ సస్పెండ్ చేసింది. బాలా జీ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థలోనూ తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు, నిబంధనల అమలులో నిరంతర వైఫల్యాలను గుర్తించడంతో దాని లైసెన్స్‌ను కూడా నిలిపివేసింది. ఆహార భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ సంస్థ స్పష్టం చేస్తోంది.
FSSAI has issued notices to Nestlé India Ltd. and Hindustan Unilever Ltd. regarding misleading claims and non-compliances.
Additionally, licenses have been suspended for M/s Sukhdarshan Pharma and M/s Bala Ji Food Products for serious food safety violations. 1(2) #FSSAINotice https://t.co/Nqf0VE3llt— FSSAI (@fssaiindia) October 17, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
అక్టోబర్ 17, 2026

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అక్టోబర్ 17, 2026

Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు
- ●Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక



