FSSAI | జెప్టోకు FSSAI నోటీసులు.. పలు కంపెనీలపై కొరఢా!
FSSAI | ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. గడువు ముగిసిన శనగపిండిని డెలివరీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై జెప్టోకు నోటీసులు జారీ చేసింది. ఉత్పత్తుల లేబులింగ్, ప్రకటనల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలపైనా చర్యలు చేపట్టింది.
FSSAI | ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. గడువు ముగిసిన శనగపిండిని డెలివరీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై జెప్టోకు నోటీసులు జారీ చేసింది. ఉత్పత్తుల లేబులింగ్, ప్రకటనల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలపైనా చర్యలు చేపట్టింది. జెప్టో మార్కెట్‌ప్లేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా గడువు ముగిసిన శనగపిండి ప్యాకెట్లు డెలివరీ అయ్యాయని ఓ వినియోగదారుడు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఫిర్యాదు చేశారు. తనకు డెలివరీ చేసిన రెండు ప్యాకెట్లపై గడువు తేదీ 2026 సెప్టెంబర్ 12గా ఉందని, డెలివరీ సమయానికి ఆ గడువు ముగిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన FSSAI.. వివరణ ఇవ్వాలంటూ జెప్టోకు నోటీసులు జారీ చేసింది.
సదరు ఆర్డర్, డెలివరీ, గిడ్డంగి, విక్రేత, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని జెప్టోను ఆదేశించింది. గడువు ముగిసిన ఉత్పత్తి వినియోగదారుడికి ఎలా చేరిందో కారణాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ప్రభావిత స్టాక్‌ను వెనక్కి తీసుకోవడం, వినియోగదారులకు సమాచారం అందించడం, రీఫండ్ ఇవ్వడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టడంపై వివరణ కోరింది. ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని సూచించింది. మరోవైపు.. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి స్టోరియా ఫుడ్స్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై న్యాయపరమైన చర్యలకు సైతం ఆమోదం తెలిపింది.
బాకెలైట్, హెల్తీహె ఫుడ్స్ ఎల్‌ఎల్‌పీ, బీఎంఎస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ తదితర సంస్థలపైనా ఆహార భద్రతా నిబంధనలు, లేబులింగ్ ప్రమాణాల ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు చేపట్టినట్లు వెల్లడైంది. వినియోగదారుల ఆరోగ్యం, ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు FSSAI స్పష్టం చేసింది. ఆహార ఉత్పత్తులపై సరైన సమాచారం ఇవ్వడంతోపాటు ప్రకటనల్లోనూ వాస్తవాలనే వెల్లడించాలని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజావార్తలు
- ●Rakul Preet Singh | రామాయణ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రకుల్ ధరించిన చీర ఖరీదు ఎంతో తెలుసా?
- ●Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు
- ●Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తానని బెదిరిస్తాడు.. లక్షలు కాజేసిన నిందితుడు ఎవరంటే!
- ●Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Chinmay Sutar | రంజీ ట్రోఫీలో చరిత్ర.. 400 పరుగులతో చిన్మయ్ సుతార్ సంచలనం!

Rakul Preet Singh | రామాయణ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రకుల్ ధరించిన చీర ఖరీదు ఎంతో తెలుసా?

Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు

Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తానని బెదిరిస్తాడు.. లక్షలు కాజేసిన నిందితుడు ఎవరంటే!

Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!





