Earbuds | మహిళ చెవిలో పేలిన ఇయర్‌బడ్స్.. వాడడంలో జాగ్రత్తలు తప్పనిసరి..
Earbuds | వైర్లెస్ ఇయర్‌బడ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చెవుల భద్రతపై ఆందోళన కలిగించే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. టర్కీలో ఓ మహిళ ఇయర్‌బడ్స్ ధరించి వాడుతున్న సమయంలో అవి పేలిపోయి ఆమె వినికిడి శక్తి కోల్పోయింది. దీంతో ఇయర్‌బడ్స్ వాడడంలో చాలా మందిలో ఆందోళన నెలకొంది.
Earbuds | వైర్లెస్ ఇయర్‌బడ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చెవుల భద్రతపై ఆందోళన కలిగించే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. టర్కీలో ఓ మహిళ ఇయర్‌బడ్స్ ధరించి వాడుతున్న సమయంలో అవి పేలిపోయి ఆమె వినికిడి శక్తి కోల్పోయింది. దీంతో ఇయర్‌బడ్స్ వాడడంలో చాలా మందిలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనను సంబంధిత బ్రాండ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఓ యూజర్ షేర్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఇయర్‌బడ్స్ వాడుతున్న సమయంలో అవి అకస్మాత్తుగా పేలిపోయాయని అతడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై స్పందించిన తయారీ సంస్థ, పేలిపోయిన ఇయర్‌బడ్స్‌ను పరిశీలించినప్పటికీ పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోయామని వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇయర్‌బడ్స్ సేఫ్టీపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
60/60 నియమాన్ని పాటించాలి..
ఈ నేపథ్యంలో సీనియర్ ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ వివేక్ కుమార్ పాఠక్ కీలక సూచనలు చేశారు. ఇయర్‌బడ్స్ వినియోగం ఇప్పుడు చాలా మందికి తప్పనిసరి భాగంగా మారిందని, పూర్తిగా మానేయడం కష్టమేనని చెప్పారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు చెవుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచించారు. ఇయర్‌బడ్స్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వినికిడి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని డాక్టర్ తెలిపారు. మధ్యమధ్యలో విరామాలు తీసుకోవడం ద్వారా చెవులపై ఒత్తిడి తగ్గి, అంతర్గత చెవి నష్టం నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఈ సందర్భంలో 60/60 నియమాన్ని పాటించాలని సూచించారు. అంటే 60 డెసిబెల్స్ శబ్దాన్ని గరిష్టంగా 60 నిమిషాల వరకు మాత్రమే వినాలి. ఇది చెవులకు అవసరమైన విశ్రాంతిని అందించి, వినికిడి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
శుభ్రం చేయడం ముఖ్యం..
ఇయర్‌బడ్స్ తరచూ వేడి, తేమకు లోనవుతుంటాయి. చెవిలో ఉండే మైన, చర్మపు కణాలు, దుమ్ము వంటి వాటితో పరికరం లోపలి భాగాలు దెబ్బతిని ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి ఇయర్ఫోన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. అలాగే చెవులను కూడా శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శుభ్రం చేసే సమయంలో పొడిగా ఉండే మృదువైన వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలని, ఇంట్లో వాడే క్లీనింగ్ ద్రావణాలు, ఆల్కహాల్ లేదా ఆయిల్ ఉత్పత్తులను వాడకూడదని హెచ్చరించారు. ఇవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ను దెబ్బతీసి పరికరం పనితీరును ప్రభావితం చేస్తాయి. అలాగే రాత్రంతా చార్జింగ్‌లో పెట్టడం మానుకోవడం ద్వారా పరికరం లైఫ్ పెరుగుతుందని, ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
చెవుల పరిశుభ్రత వ్యక్తిగత ఆరోగ్యానికి కీలకమని డాక్టర్ వివేక్ కుమార్ పాఠక్ అన్నారు. ఇయర్‌బడ్స్ వాడుతున్నప్పుడు చెవిలో వేడి ఎక్కువగా అనిపించడం, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరికరాన్ని తీసేయాలని సూచించారు. అటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి, చెవులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా నష్టం జరిగిందా అని పరీక్షించుకోవడం అవసరమని చెప్పారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



