Diabetes Drinks | డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన పానీయాలు ఇవే.. ఎల్లప్పుడూ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..
Diabetes Drinks | డయాబెటిస్ లేదా మధుమేహం అన్నది దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ నియంత్రణలో ఉంటే వైద్యులు పలు రకాల మందులను దీర్ఘకాలిక వాడకం కోసం అప్పుడప్పుడు మారుస్తుంటారు. అయితే దీర్ఘాలంలో షుగర్ లెవల్స్‌ను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా కష్టమే అని చెప్పాలి.
Diabetes Drinks | డయాబెటిస్ లేదా మధుమేహం అన్నది దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ నియంత్రణలో ఉంటే వైద్యులు పలు రకాల మందులను దీర్ఘకాలిక వాడకం కోసం అప్పుడప్పుడు మారుస్తుంటారు. అయితే దీర్ఘాలంలో షుగర్ లెవల్స్‌ను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా కష్టమే అని చెప్పాలి. ఇందుకు గాను డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు జీవనశైలి విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అది ఇతర దుష్సరిణామాలకు దారి తీస్తుంది. ఇక షుగర్ ఉన్నవారు రోజూ పాటించే తమ దినచర్యతోపాటు పలు రకాల పానీయాలను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవచ్చని, డయాబెటిస్ అదుపులో ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
కాకరకాయ జ్యూస్..
షుగర్ లెవల్స్‌ను తగ్గించి నియంత్రణలో ఉంచడంలో కాకరకాయ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలను సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎంతో పురాతన కాలం నుంచే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కాకరకాయల్లో పాలిపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ లా ప్రవర్తిస్తుంది. అందువల్ల కాకరకాయ జ్యూస్‌ను సేవిస్తుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో తాగాల్సి ఉంటుంది. దాన్ని నేరుగా తాగలేమని అనుకుంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. షుగర్ లెవల్స్ మరీ అధికంగా ఉన్నవారు రాత్రి పూట తినడానికి ముందు కూడా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది. కాకరకాయ రసాన్ని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉండడంతోపాటు డయాబెటిస్ కారణంగా తలెత్తే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

మెంతులు, దాల్చిన చెక్క..
షుగర్ ఉన్నవారికి మెంతుల నీళ్లు కూడా మేలు చేస్తాయి. మెంతుల్లో 4-హైడ్రాక్సీసోల్‌యూసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల్లో ఉండే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను పరగడుపునే తిని అనంతరం ఆ నీళ్లను తాగేయాలి. ఇలా చేస్తుంటే షుగర్ ఉన్నవారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుండవచ్చు. ఇలా కూడా ఉపయోగం ఉంటుంది. దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది భోజనం అనంతరం ఇన్సులిన్ చర్యను పెంచుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా దాల్చిన చెక్క నీళ్లు షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి.
మందార పువ్వులు, కలబంద..
మందార పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తాగుతున్నా కూడా డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ పువ్వుల్లో ఆంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల కణాలు చక్కెరను మరింత ఎక్కువగా శోషించుకుంటాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అదేవిధంగా కలబంద గుజ్జును కూడా రోజూ తీసుకోవచ్చు. ఇందులో పాలిశాకరైడ్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. కనుక కలబంద కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఒక టీస్పూన్ కలబంద గుజ్జును ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా పానీయాలను తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నవారు అద్భుతమైన లాభాలను పొందవచ్చు. చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



