Cardamom | భోజనం చేసిన తరువాత యాలకులను తినండి.. ఎంతో మేలు కలుగుతుంది..!
Cardamom | యాలకులను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. యాలకులను వేయడం వల్ల వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. యాలకులను ఎక్కువగా మసాలా వంటకాలతోపాటు తీపి వంటకాల్లోనూ వేస్తుంటారు. అయితే ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మనకు అనేక లాభాలను అందిస్తాయి.
Cardamom | యాలకులను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. యాలకులను వేయడం వల్ల వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. యాలకులను ఎక్కువగా మసాలా వంటకాలతోపాటు తీపి వంటకాల్లోనూ వేస్తుంటారు. అయితే ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మనకు అనేక లాభాలను అందిస్తాయి. భోజనం చేసిన అనంతరం చాలా మంది లవంగాలు లేదా సోంపు గింజలను తింటారు. అయితే యాలకులను కూడా తినవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. భోజనం అనంతరం యాలకులను నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
నోటి సమస్యలకు..
యాలకులను క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలుస్తారు. ఇవి నిజంగానే అలాంటి రుచిని, ఔషధ గుణాలను అందిస్తాయి. యాలకులను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. పలు చికిత్సల్లోనూ వీటిని వాడుతారు. ఇక భోజనం అనంతరం రెండు యాలకులను తీసుకుని నేరుగా నమిలి మింగితే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాలకులను నమలడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. యాలకులను మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. వీటి వల్ల నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంత క్షయం రాకుండా అడ్డుకోవచ్చు. చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది.

అధిక బరువు తగ్గేందుకు..
యాలకులను తినడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా, వేగంగా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉన్నవారు యాలకులను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. యాలకుల వల్ల జీర్ణాశయ కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో పొట్ట భారంగా అనిపించదు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భోజనం చేసిన అనంతరం యాలకులను తింటుంటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా లివర్, కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. అలాగే శరీర మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా యాలకులు పనిచేస్తాయి.
ఆకలి అదుపులో..
సాధారణంగా కొందరికి భోజనం చేసిన అనంతరం కాసేపటికి ఆకలి అయినట్లు అనిపిస్తుంది. దీంతో అలాంటి వారు అప్పటికే భోజనం చేసి ఉంటారు కనుక ఈసారి చిరుతిండి తింటారు. ఇలా చిరుతిండికి చాలా మంది అలవాటు పడతారు. దీంతో శరీరంలో అనవసరంగా క్యాలరీలు చేరతాయి. బరువు పెరుగుతారు. అయితే భోజనం చేసిన అనంతరం యాలకులను నమిలి తింటుంటే మళ్లీ ఆకలి అవకుండా ఉంటుంది. దీంతో చిరు తిండి జోలికి వెళ్లరు. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవడం తేలికవుతుంది. ఇక యాలకులను తింటుంటే రక్త నాళాలు ప్రశాంతంగా మారి రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారికి యాలకులు ఎంతో మేలు చేస్తాయి. అలాగే యాలకులను నమిలితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇలా యాలకులు మనకు ఎంతో మేస్తాయి.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



