త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja | ముత్తంగి ఓఆర్ఆర్‌ టోల్ గేట్‌ వ‌ద్ద‌ భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైద‌రాబాద్ శివార్ల‌లోని పటాన్‌చెరులో భారీగా గంజాయి (Ganja) ప‌ట్టుబ‌డింది. ప‌టాన్‌చెరూలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ గేట్ వద్ద పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

G

Telangana | Published On Jan 12, 2026, 10.35 am IST

Ganja | ముత్తంగి ఓఆర్ఆర్‌ టోల్ గేట్‌ వ‌ద్ద‌ భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ శివార్ల‌లోని పటాన్‌చెరులో భారీగా గంజాయి (Ganja) ప‌ట్టుబ‌డింది. ప‌టాన్‌చెరూలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ గేట్ వద్ద పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హ్యుండాయ్ కారు, డీసీఎం వాహనంలో సోదాలు నిర్వ‌హించారు. దీంతో రెండు వాహ‌నాల్లో క‌లిపి మొత్తం 93 కిలోల గంజాయి ల‌భించింది. రెండు వాహ‌నాల‌ను సీజ్ చేశామ‌న్నారు. ప‌ట్టుబ‌డిన గంజాయి విలువ‌ ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ని తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు డ్ర‌గ్స్‌ను తరలిస్తున్నార‌ని చెప్పారు.

గంజాయితో పాటు రూ.11 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. సోలాపూర్‌కు చెందిన సచిన్ గంగారం, మహేష్, విజయ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామ‌న్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా వివరాలు, నెట్‌వర్క్ గురించి ఆరాతీస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement