త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Papaya | రాత్రి పూట బొప్పాయి పండ్ల‌ను తిన‌వ‌చ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Papaya | పోషకాల ప‌రంగా చూస్తే బొప్పాయిని ఎంతో ప్రయోజ‌న‌క‌ర‌మైన పండుగా పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ప‌పైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. దీని వ‌ల్ల‌ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

S

Health | Published On Feb 9, 2026, 11.37 am IST

Papaya | రాత్రి పూట బొప్పాయి పండ్ల‌ను తిన‌వ‌చ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Advertisement

Papaya | పోషకాల ప‌రంగా చూస్తే బొప్పాయిని ఎంతో ప్రయోజ‌న‌క‌ర‌మైన పండుగా పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ప‌పైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. దీని వ‌ల్ల‌ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ క్యాల‌రీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో బొప్పాయి బరువు నియంత్రణలో ఉన్నవారికి తేలికపాటి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది రోజువారీ ఆహారంలో బొప్పాయిని హెల్తీ ఫ్రూట్ గా చేర్చుకుంటారు.

పండ‌ని లేదా దోర‌గా ఉన్న బొప్పాయిని తింటే..

రాత్రి బొప్పాయి తినడం హానికరం అనే విషయాన్ని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే అందరికీ రాత్రి తినడం వల్ల ప్రత్యేకమైన మేలు కలుగుతుందనే పరిశోధనలూ అందుబాటులో లేవు. కొన్ని ఆన్‌లైన్ కథనాలు రాత్రి బొప్పాయి తింటే జీర్ణక్రియకు మేలు చేస్తుందని చెబుతాయి. అయితే ఇవి ఎక్కువగా అనుభవాలు, సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడినవే తప్ప శాస్త్రీయ అధ్యయనాలు కావు. పండని లేదా దోర‌గా ఉండే బొప్పాయిలో లాటెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నవాహికను, జీర్ణనాళాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాత్రి పూట ఇలా తింటే గ్యాస్, అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు రాత్రి బొప్పాయి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు పండని బొప్పాయిని పూర్తిగా దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే లాటెక్స్ అలర్జీ ఉన్నవారు కూడా బొప్పాయి తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి.

రాత్రి పూట తినాలా, వ‌ద్దా..?

పండిన బొప్పాయిని పరిమితంగా తీసుకోవడం చాలా మందికి సురక్షితమే. ఆరోగ్య సమస్యలు లేని వారు చిన్న మోతాదులో రాత్రి తిన్నా సాధారణంగా ఇబ్బంది ఉండదు. అయితే గ్యాస్, అజీర్తి, యాసిడ్ సమస్యలు ఉన్నవారు రాత్రి కాకుండా పగటి పూట తినడం మంచిది. నిద్రకు వెంటనే ముందు తినకుండా కొంత గ్యాప్ ఇవ్వడం ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఇక రాత్రి పూట‌ బొప్పాయి పండ్ల‌ను తిన‌కూడ‌దు అని చెప్పే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే ప్రత్యేక లాభాలున్నాయన్న నిర్ధారణ కూడా లేదు. శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి, పరిమితంగా తీసుకోవడమే ఉత్తమ మార్గం. అనుకూలంగా ఉంటే రాత్రి పూట ఈ పండ్ల‌ను తిన‌డాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. అదే ఇబ్బందులు ఎదురైతే మాత్రం రాత్రి పూట ఈ పండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా ఎవ‌రికి వారు ఈ విష‌యంపై సొంతంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement