Swiggy Biryani Report | 2025లో స్విగ్గీ నుంచి 9.3 కోట్ల బిర్యానీలు లాగించేశారు
చికెన్ రోల్‌కి 4.1 మిలియన్ ఆర్డర్లు, వెజ్ పిజ్జాకి 3.6 మిలియన్ ఆర్డర్లు, చికెన్ నగ్గెట్స్‌కి 2.9 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత చాయ్ సమోసా అందులోనూ అద్రక్ చాయ్‌కి బాగానే ఆర్డర్లు వచ్చాయి.
Swiggy Biryani Report | ఏరా మామా.. బిర్యానీ తిందామా? మమ్మీ నాకు ఈరోజు బిర్యానీ తినాలని ఉంది. ఇంట్లో ఏం వండకు. డాడీ నాకు బిర్యానీ తినాలని ఉంది. ఆర్డర్ చేయ్. ఏవండి బిర్యానీ తిందామా? ఇలా ఎక్కడ చూసినా బిర్యానీ గోలే. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే 2025 లో స్విగ్గీ యాప్ నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసింది బిర్యానీయే అట. ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల బిర్యానీలు ఆర్డర్ పెట్టారట. స్విగ్గీ రిపోర్టులో ఇంకా చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్విగ్గీ యూజర్లు ఇండియాలో 93 మిలియన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టారట. 9.3 కోట్లు. నిమిషానికి 194 బిర్యానీ ప్లేట్స్. సెకండ్‌కి సుమారు 3 బిర్యానీలను ఆర్డర్ పెట్టినట్లు స్విగ్గీ రిపోర్ట్ చెబుతోంది. అందులో చికెన్ బిర్యానీ మిగితా బిర్యానీలను డామినేట్ చేసింది. కేవలం చికెన్ బిర్యానీకే 57.7 మిలియన్ ఆర్డర్లు వచ్చాయట. ఆ తర్వాత 44.2 మిలియన్ ఆర్డర్లతో బర్గర్ రెండో ప్లేస్‌లో ఉండగా, 40.1 మిలియన్ ఆర్డర్లతో పిజ్జా మూడో స్థానం, 26.2 మిలియన్ ఆర్డర్లతో వెజ్ దోశా నాలుగో స్థానంలో ఉంది.
స్నాక్స్ ఆర్డర్లు కూడా ఎక్కువే
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు స్నాక్స్ ఆర్డర్లు కూడా కోట్లలో వచ్చాయట. స్నాక్ టైమ్ ఫేవరేట్ మాత్రం బర్గర్ కాగా అందులో చికెన్ బర్గర్లు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారు. చికెన్ బర్గర్‌కి 6.3 మిలియన్ ఆర్డర్లు రాగా, వెజ్ బర్గర్‌కి 4.2 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి.
చికెన్ రోల్‌కి 4.1 మిలియన్ ఆర్డర్లు, వెజ్ పిజ్జాకి 3.6 మిలియన్ ఆర్డర్లు, చికెన్ నగ్గెట్స్‌కి 2.9 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత చాయ్ సమోసా అందులోనూ అద్రక్ చాయ్‌కి బాగానే ఆర్డర్లు వచ్చాయి.
ఇక.. బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే ఎక్కువగా ఇడ్లీలను ఆర్డర్ చేశారు. 11 మిలియన్ ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత వెజ్ దోశ, వెజ్ పూరీ, ఆలూ పరాటా ఉన్నాయి. లేట్ నైట్‌లో ఎక్కువగా చికెన్ బర్గర్లను ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ, వెజ్ బర్గర్, వెజ్ పిజ్జా టాప్‌లో ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Family Dies After Eating Biryani | విషాదం: బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఏప్రిల్ 27, 2026

LPG Cylinder Shortage | సిలిండర్ల కొరత.. పార్సిళ్లకే పరిమితమైన బావర్చి బిర్యాని..
మార్చి 15, 2026

Swiggy Orders | న్యూ ఇయర్ పార్టీ.. 2 లక్షల బిర్యానీలను ఆరగించారు..
జనవరి 1, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



