త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయ‌డానికే ప‌నికొస్త‌వ్‌ నువ్

Goutham Prasad | సిద్దిపేట‌లో హ‌రీశ్ రావు ప‌నైపోయింద‌ని అద్దంకి ద‌యాక‌ర్ (Addanki Dayakar) జోస్యం చెప్తున్నార‌ని.. ఆ జోస్య‌మేదో ఎంజీబీఎస్ ద‌గ్గ‌ర చెప్పుకుంటే క‌నీసం ఉపాధి అయినా దొరుకుతుంద‌ని బీఆర్ఎస్ నేత గౌత‌మ్ ప్ర‌సాద్ (Goutham Prasad) ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Nov 22, 2026, 1.29 pm IST

Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయ‌డానికే ప‌నికొస్త‌వ్‌ నువ్
Advertisement
  • హ‌రీశ్ రావు ప‌నైపోయింద‌ని జోస్యం చెప్తున్న‌వ్ కదా
  • ఎంజీబీఎస్ దగ్గర జోస్యం చెప్పుకో.. ఉపాధైనా దొరుకుత‌ది
  • తాగి వాగ‌డం త‌ప్పా నువ్ చేసేదేముండ‌దు
  • అద్దంకి ద‌యాక‌ర్‌పై బీఆర్ఎస్ నేత గౌత‌మ్ ప్ర‌సాద్ ధ్వ‌జం

Goutham Prasad | త్రినేత్ర న్యూస్‌: సిద్దిపేట‌లో హ‌రీశ్ రావు ప‌నైపోయింద‌ని అద్దంకి ద‌యాక‌ర్ (Addanki Dayakar) జోస్యం చెప్తున్నార‌ని.. ఆ జోస్య‌మేదో ఎంజీబీఎస్ ద‌గ్గ‌ర చెప్పుకుంటే క‌నీసం ఉపాధి అయినా దొరుకుతుంద‌ని బీఆర్ఎస్ నేత గౌత‌మ్ ప్ర‌సాద్ (Goutham Prasad) ఎద్దేవా చేశారు. ఆయ‌న తాగి వాగ‌డం త‌ప్పా తెలంగాణ‌కు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. అడ్డంగా పెరిగి దొడ్డిదారిన ఎమ్మెల్సీ ప‌ద‌వి తెచ్చుకున్నార‌ని ఆరోపించారు. రేవంత్ చెప్పులు మోయ‌డానికే అద్దంకి ప‌నికొస్తాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

సోయి లేకుండా, తాగి ఇష్టం వచ్చినట్లు అద్దంకి దయాకర్ మాట్లాడాడు. సిద్దిపేటలో హరీశ్‌రావు పని అయిపోయిందని జోస్యం చెప్తున్నాడు. సిద్దిపేటలో ఓటమి ఎరగని నాయకుడు హరీశ్‌రావు. రెండుసార్లు గ్యాదరి కిశోర్‌పై చిత్తు చిత్తుగా ఓడినోడు అద్దంకి దయాకర్. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూట్లు నాకే వ్యక్తి అద్దంకి దయాకర్. అడ్డంగా పెరిగి, అడ్డమైన ఆలోచనలే ఉంటాయి. తెలంగాణ ప్రజలకు ఏమైనా మంచి పనైనా చేశావా? చంద్రబాబు నాయుడు చెప్పులు రేవంత్ రెడ్డి మోస్తే.. రేవంత్ రెడ్డి చెప్పులు అద్దంకి దయాకర్ మోస్తున్నాడు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగా ఉన్న నాకేం సిగ్గనట్లు అద్దంకి దయాకర్ వైఖరి ఉంది.

కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు అక్రమంగా కుప్పంకు తీసుకొని పోతుంటే ఏనాడైనా అద్దంకి దయాకర్ మాట్లాడిండా? తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ ఎలా అవుతాడు? పట్టపగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను నీళ్లు దోచుకొని పోతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను గడ్డిపోచలా వదులుకున్న వ్యక్తి హరీశ్‌రావు. తెలంగాణ ప్రజలపై రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ ఊడిగం చేస్తున్నాడు.

కాంగ్రెస్ ప‌నైపోయింద‌ని హ‌రీశ్‌రావుకు చెప్ప‌లేదా నువ్‌?

తెలంగాణ ఉద్యమమే లేకపోతే అద్దంకి దయాకర్ ఎక్కడోడు? అద్దంకి దయాకర్ ను వెలుగులోకి తెచ్చిందే కేసీఆర్. సినిమాలో వేషాల కోసం చిల్లర అడుక్కొనే వ్యక్తి అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అద్దంకి దయాకర్ హరీశ్‌రావు దగ్గర చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోలేమని చెప్పాడు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వమని అద్దంకి దయాకర్, ఆయన సతీమణి కలిసి హరీశ్‌రావు దగ్గరకు వచ్చిన మాట నిజం కాదా. హరీశ్‌ రావు దగ్గర ఆర్థిక సహాయం తీసుకున్నది నిజం కాదా?

చింపాంజీ, నువ్ ఒక్క‌టే

తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది చనిపోవడానికి కారణమే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో అద్దంకి దయాకర్ ఒక పావులా ఆడుతున్నాడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చెయ్యమని చెప్పు. సిద్దిపేటలో పోటీ చేసేందుకు దమ్ము, ధైర్యం ఉందా అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కాళ్ళు పట్టుకున్నావు. చింపాంజీ , అద్దంకి దయాకర్ ఒకటే దానికి బుద్ధి ఉండదు.. అద్దంకి దయాకర్ కు బుద్ధి ఉండదు.

రేవంత్ రెడ్డి దగ్గరకు హరీశ్‌రావు వచ్చి నిధులు అడుక్కోవాలని అంటున్నావు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చారు? రేవంత్ రెడ్డిపైన రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా. రేవంత్ రెడ్డి దగ్గర విద్యా శాఖ పెట్టుకొని కూతురితో ఇంటర్నేషనల్ స్కూళ్లు పెట్టిస్తున్నాడు. దీనిపై మాట్లాడే దమ్ము అద్దంకి దయాకర్ కు ఉందా? నిధుల కోసం రేవంత్ రెడ్డి దగ్గరకు హరీశ్‌రావు పోవాల్సిన అవసరం లేదు. హరీశ్‌రావు దగ్గరకే రేవంత్ రెడ్డి వచ్చాడు, సిద్దిపేటలో సభ పెట్టుకున్నాడు.

హరీశ్‌రావు త్యాగం పోరాటం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. శ్రీ శ్రీ అన్నట్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బానిస అయితే.. రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ బానిస. బల్మూరి వెంకట్ హరీశ్‌రావు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బల్మూరి వెంకట్ కబ్జాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బల్మూరి వెంకట్ కారుకు యాక్సిడెంట్ అయితే కేటీఆర్ కు ఏం సంబంధం. బల్మూరి వెంకట్ కేటీఆర్‌పై బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని గౌత‌మ్ ప్ర‌సాద్‌ దుయ్య‌బ‌ట్టారు.

Advertisement
Advertisement