Carrots For Skin And Hair | చలికాలంలో చర్మ సంరక్షణకు క్యారెట్లను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
Carrots For Skin And Hair | చలికాలంలో క్యారెట్లు మనకు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఏడాది పొడవునా క్యారెట్లు మనకు లభిస్తాయి. కానీ చలికాలంలో ఎక్కువగా దర్శనమిస్తాయి. క్యారెట్లను చాలా మంది తరచూ ఉపయోగిస్తూనే ఉంటారు. క్యారెట్లతో పలు రకాల వంటకాలను కూడా చేస్తుంటారు.
Carrots For Skin And Hair | చలికాలంలో క్యారెట్లు మనకు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఏడాది పొడవునా క్యారెట్లు మనకు లభిస్తాయి. కానీ చలికాలంలో ఎక్కువగా దర్శనమిస్తాయి. క్యారెట్లను చాలా మంది తరచూ ఉపయోగిస్తూనే ఉంటారు. క్యారెట్లతో పలు రకాల వంటకాలను కూడా చేస్తుంటారు. క్యారెట్ పచ్చడి, హల్వా, కిచిడీ వంటి వంటకాలతోపాటు చారులోనూ క్యారెట్లను వేస్తారు. క్యారెట్లు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా అలాగే పచ్చిగా కూడా తినవచ్చు. అయితే చలికాలంలో క్యారెట్లను రోజూ తినాల్సిందే అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూట్రిషనిస్టు నమామి అగర్వాల్ చలికాలంలో చర్మ సంరక్షణకు క్యారెట్లను తినాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి..
నమామి అగర్వాల్ మాట్లాడుతూ మనం చలికాలం ఆహారంలో కచ్చితంగా క్యారెట్‌ను చేర్చుకోవాలి. దీన్ని రోజూ తినాలి. క్యారెట్లు మన చర్మం, శిరోజాలకు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. సూర్యకాంతి వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. క్యారెట్లను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకోవచ్చు. చర్మ సంరక్షణకు క్యారెట్ మేలు చేస్తుంది.. అని తెలిపారు. క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బీటా కెరోటిన్ వల్ల శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. దీని వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.

సూర్యకాంతి నుంచి రక్షణ..
క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుందని న్యూట్రిషనిస్టు నమామి అగర్వాల్ తెలిపారు. క్యారెట్లను ఈ సీజన్‌లో రోజూ తినాలని ఆమె సూచించారు. దీని వల్ల చర్మం బిగుతుగా ఉంటుందని, ముడతలు, మచ్చలు తొలగిపోయి యంగ్‌గా కనిపిస్తారని ఆమె చెప్పారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. దీంతో ఎండలో తిరగడం వల్ల చర్మం కందిపోకుండా, రంగు మారకుండా చూసుకోవచ్చు. బీటా కెరోటిన్ సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది.
శిరోజాలకు సైతం..
క్యారెట్లను తినడం వల్ల మొటిమలు తగ్గడంతోపాటు చర్మంపై ఉండే దురద, ఎరుపుదనం, దద్దుర్లను కూడా తగ్గించుకోవచ్చు. క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఆయా సమస్యలను తగ్గిస్తాయి. అలాగే చేతులు, పాదాల వాపులు సైతం తగ్గిపోతాయి. క్యారెట్లలో అధికంగా ఉండే విటమిన్ ఎ శిరోజాలను రక్షిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. విటమిన్ ఎ వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇలా క్యారెట్లు కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తాయి. కనుక క్యారెట్లను రోజూ తినాలని లేదా వీటి జ్యూస్‌ను అయినా తాగాలని నమామి అగర్వాల్ సూచించారు.
సంబంధిత వార్తలు

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026

Liver Protection Supplements | రెగ్యులర్‌గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!
జూన్ 4, 2026

High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా ‘హైబీపీ’.. ఏటా 16 లక్షల మంది బలి
మే 28, 2026
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్



