LPG Cylinder Shortage | సిలిండర్ల కొరత.. పార్సిళ్లకే పరిమితమైన బావర్చి బిర్యాని..
LPG Cylinder Shortage | హైదరాబాద్ బిర్యానీ అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి (Bawarchi) గుర్తొస్తుంది. నిత్యం నోరూరుంచే ఘుమఘుమలు, కిక్కిరిసి పోయే జనంతో రద్దీగా ఉంటే బావర్చి ఇప్పుడు కలతప్పి పోయింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత (LPG Cylinder Shortage) ఈ హోటల్‌పైనా పడటంతో మూసివేతకు చేరువైంది.
LPG Cylinder Shortage | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ బిర్యానీ అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి (Bawarchi) గుర్తొస్తుంది. నిత్యం నోరూరుంచే ఘుమఘుమలు, కిక్కిరిసి పోయే జనంతో రద్దీగా ఉంటే బావర్చి ఇప్పుడు కలతప్పి పోయింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత (LPG Cylinder Shortage) ఈ హోటల్‌పైనా పడటంతో మూసివేతకు చేరువైంది. ఇప్పటికే నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టేమేనని నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా (Shutdown) ఉంది. క్రాస్ రోడ్స్‌లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా గ్యాస్ కారణంగా ఇప్పటికే మూతపడింది.
ఇక ఇరాన్ యుద్ధ ప్రభావంతో చిన్న హోటళ్ల నుంచి రెస్టారెంట్ల వరకు మెనూను తగ్గించుకోవడంతోపాటు ధరలు పెంచేస్తున్నాయి. టిఫిన్ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్‌పై రూ.50 వరకు పెంచేశాయి. మరోవైపు హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేస్తున్నారు. మూడు పూటలా భోనమే వడ్డిస్తున్నారు. కాగా, గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ.2 వేల వరకు, కమర్షియల్ గ్యాస్ ధర రూ.3 వేల నుంచి 5 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్లు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఏజెన్సీల్లో నో స్టాక్ అంటూ చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్





