త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్‌

తెలుగు కామెడీ మూవీ పతంగ్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 30 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Flash news | Published On Jan 24, 2026, 7.02 pm IST

Telugu OTT |   ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్‌
Advertisement

Telugu OTT |  హైద‌రాబాద్ యాస, సంస్కృతుల‌తో రూపొందిన తెలుగు కామెడీ  మూవీ పతంగ్ ( Patang Telugu Movie) ఓటీటీలోకి(Ott) రాబోతుంది. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీలో ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, వంశీ పూజిత్‌, ప్రీతీ ప‌గ‌డాల హీరోహీరోయిన్లుగా న‌టించారు. గౌత‌మ్ మీన‌న్‌, ఎస్‌పీ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ప్ర‌ణీత్ ప‌త్తిపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో...

పతంగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ శ‌నివారం క‌న్ఫామ్ అయ్యింది. జ‌న‌వ‌రి 30 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. విడుద‌ల తేదీని ఓ పోస్ట‌ర్ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్ రివీల్ చేసింది.
ప‌తంగుల పోటీ అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ ఈ సినిమాను రూపొందించారు. ఈ చిన్న సినిమా థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. హైద‌రాబాద్ యాస‌లో సాగిన‌ డైలాగ్స్ తో పాటు కామెడీ బాగుంద‌నే టాక్ వ‌చ్చింది. జోస్ జిమ్మి మ్యూజిక్‌తో పాటు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, జెస్పీ గిఫ్ట్ వంటి సింగ‌ర్స్ ఆల‌పించిన పాట‌లు ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. జెన్‌జీ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా ఈ సినిమాను రూపొందించారు. బేబీ సినిమాతో కంపేరిజ‌న్స్ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 26న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌స్తోంది.

పతంగుల పోటీ...

విస్కీ, అరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్‌. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసే పెరుగుతారు. ఐశ్వ‌ర్య అనే అమ్మాయి కార‌ణంగా విస్కీ, అరుణ్ మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఐశ్వ‌ర్య‌ను విస్కీతో పాటు అరుణ్ ఇద్ద‌రు ప్రేమిస్తారు. ఐశ్వ‌ర్య ప్రేమ కోసం స్నేహితుల మ‌ధ్య‌ పతంగ్‌ల పోటీ జ‌రుగుతుంది. ఇందులో ఎవ‌రు గెలిచారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement