Nirmala Sitharaman | నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ 83 నిమిషాలే..
Nirmala Sitharaman | 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను (Union Budget) కేంద్రం ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభ ముందుకు తీసుకెళ్లారు.
Flash news | Published On Feb 1, 2026, 12.51 pm IST
Nirmala Sitharaman | 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను (Union Budget) కేంద్రం ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభ ముందుకు తీసుకెళ్లారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్‌పై ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ పలు రికార్డులను బ్రేక్ చేశారు. వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతకు ముందు వేర్వేరు సమయాల్లో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పదిసార్లు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు క్రియేట్ చేశారు.
ఇక చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు (Budget 2026 speech) చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి కేవలం 83 నిమిషాలు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. 12:23 నిమిషాలకు తన ప్రసంగాన్ని ముగించారు. గతంతోపోలిస్తే తక్కువ సమయంలోనే బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో నిర్మలమ్మ గత బడ్జెట్ ప్రసంగాలను ఒకసారి పరిశీలిస్తే..
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాలు..
2019లో.. 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు)
2020లో.. 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు)
2021లో.. 110 నిమిషాలు (గంట 50 నిమిషాలు)
2022లో.. 93 నిమిషాలు (గంట 33 నిమిషాలు)
2023లో.. 87 నిమిషాలు (గంట 27 నిమిషాలు)
2024లో.. (మధ్యంత బడ్జెట్) 56 నిమిషాలు
2024లో.. (పూర్తిస్థాయి బడ్జెట్) 85 నిమిషాలు (గంట 25 నిమిషాలు)
2025 .. 75 నిమిషాలు (గంటా 15 నిమిషాలు)
2026 (ప్రస్తుతం) : 83 నిమిషాలు ( గంట 23 నిమిషాలు)
సంబంధిత వార్తలు

Delhi court | న్యాయమూర్తి నోట Floccinaucinihilipilification పదం.. అసలు దీని అర్థమేంటి..?
ఏప్రిల్ 2, 2026

Prahlad Joshi | తెలంగాణకు ఏం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఫిబ్రవరి 6, 2026

UPI transactions | రూ.230 లక్షల కోట్లు.. రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు : కేంద్రం
ఫిబ్రవరి 4, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



