త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | సెమీకండ‌క్ట‌ర్ రంగం కోసం రూ.40 వేల కోట్లు : నిర్మలా సీతారామన్

Union Budget 2026 | దేశ సెమీకండ‌క్ట‌ర్ వృద్ధి కోసం సెమీ కండ‌క్ట‌ర్ ఇండియా మిష‌న్ 2.0ని (Semiconductor mission 2.0) నిర్మ‌ల‌మ్మ‌ ప్ర‌క‌టించారు.

D

Flash news | Published On Feb 1, 2026, 11.43 am IST

Union Budget 2026 | సెమీకండ‌క్ట‌ర్ రంగం కోసం రూ.40 వేల కోట్లు : నిర్మలా సీతారామన్
Advertisement

Union Budget 2026 | వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వ‌రుస‌గా తొమ్మిదోసారి పార్ల‌మెంట్‌కు బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభించారు. విక‌సిత్ భార‌త్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా దేశ సెమీకండ‌క్ట‌ర్ వృద్ధి కోసం సెమీ కండ‌క్ట‌ర్ ఇండియా మిష‌న్ 2.0ని (Semiconductor mission 2.0) నిర్మ‌ల‌మ్మ‌ ప్ర‌క‌టించారు. ఇందుకోసం రూ.40,000 కోట్లు కేటాయించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సెమీకండ‌క్ట‌ర్ల కోసం పరిశ్ర‌మ‌ల నేతృత్వంలోని ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణా కేంద్రాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. అంతేకాదు రూ.10 వేల కోట్ల‌తో బ‌యోఫార్మా శ‌క్తి ప‌థ‌కాన్ని కూడా నిర్మ‌ల‌మ్మ ప్ర‌క‌టించారు. ఫార్మా, విద్య‌, ప‌రిశోధ‌న‌కు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థ‌లు తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement