Shoot Out | ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు పోలీసుల ఫైరింగ్
Shoot Out | హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కాల్పులు కలకలం (Shoot Out) సృష్టించాయి. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రంలో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Shoot Out | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కాల్పులు కలకలం (Shoot Out) సృష్టించాయి. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రంలో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రెండేండ్లుగా వెతుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే అవకాశం రావడంతో నల్లగొండ సీసీఎస్ (CCS) పోలీసులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదిభట్ల సమీపంలోని బొంగులూరు గేటు (Bongulur Gate) సమీపంలో ఓఆర్ఆర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే అతడు తిరగబడి తప్పించేందుకు ప్రయత్నించడంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
గాయపడిన అతడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం దవాఖానకు తరలించారు. నిందితుడిని ఏపీకి చెందిన భూష్మి శ్రీకాంత్‌గా గుర్తించారు. అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. అందులో పదికిపైగా దొంగతనాలు, నాలుగేండ్ల క్రితం ఏపీలో ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | ట్రక్కును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఏడుగురు సజీవ దహనం
- ●France Vs Sweden | ఎంబాప్పే మ్యాజిక్.. రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్
- ●Commercial LPG Cylinder | తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
- ●Norway Vs Ivory Coast | ప్రీక్వార్టర్స్‌లోకి నార్వే..
- ●MGNREGA | ముగిసిన ఉపాధి హామీ గడువు.. నేటి నుంచి అమల్లోకి వీబీ జీ రామ్ జీ
- ●Horoscope | త్వరలో అరుదైన శుభయోగం.. ఈ మూడురాశుల వారికి అన్నీ శుభవార్తలే..!

Road Accident | ట్రక్కును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఏడుగురు సజీవ దహనం

France Vs Sweden | ఎంబాప్పే మ్యాజిక్.. రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

Commercial LPG Cylinder | తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..

Norway Vs Ivory Coast | ప్రీక్వార్టర్స్‌లోకి నార్వే..






