France Vs Sweden | ఎంబాప్పే మ్యాజిక్.. రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్
France Vs Sweden | ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే రెండు గోల్స్‌తో మెరిసింది. బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఫ్రాన్స్ అదే జోరును నాకౌట్ దశలోనూ కొనసాగించింది.
- స్వీడన్‌పై 3-0 తేడాతో ఘన విజయం
- డబుల్ గోల్స్ చేసిన ఎంబాప్పే
- ఇంటిబాటపట్టిన స్వీడన్
- పరాగ్వేతో తలపడనున్న ఫ్రాన్స్
France Vs Sweden | ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే రెండు గోల్స్‌తో మెరిసింది. బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఫ్రాన్స్ అదే జోరును నాకౌట్ దశలోనూ కొనసాగించింది. ఈ విజయంతో స్వీడన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. జూలై 4న ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగే ప్రీక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ పరాగ్వేతో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ ఆధిపత్యం చాటింది. తొలి ప్రథమార్థంలోనే స్వీడన్‌పై ఎటాకింగ్‌కు దిగింది. తొలి 45 నిమిషాల్లోనే ఫ్రాన్స్ ప్లేయర్లు 15 సార్లు ప్రయత్నించారు. ఎంబాప్పే చేసిన ఒక గోల్ ఆఫ్‌సైడ్‌గా తేలింది. మరో షాట్ గోల్‌పోస్ట్‌ను తాకి బయటకు వెళ్లిపోయింది. మైఖేల్ ఒలిసే చేసిన అద్భుతమైన ఓవర్‌హెడ్ కిక్ సైతం గోల్‌పోస్ట్‌ను తాకి పోయింది.
ఎక్స్‌ట్రా టైమ్‌లో..
అయితే, తొలిభాగం అదనపు సమయంలో ఎంబాప్పే అద్భుతమైన గోల్‌తో ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ద్వితీయార్థం ప్రారంభమైన తర్వాత కూడా ఫ్రాన్స్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 53వ నిమిషంలో మైఖేల్ ఒలిసే అందించిన చక్కటి పాస్‌ను బ్రాడ్లీ బార్కోలా పెనాల్టీ బాక్స్‌లోనుంచి గోల్‌గా మలిచి స్కోరును 2-0కు చేర్చాడు. ఆ తర్వాత కూడా ఫ్రాన్స్ వరుస దాడులు కొనసాగించింది. జూల్స్ కుండే, మైఖేల్ ఒలిసే చేసిన పలు ప్రయత్నాలను స్వీడన్ గోల్‌కీపర్ జాకబ్ విడెల్ జెట్టర్‌స్ట్రోమ్ అడ్డుకోవడంతో మరింత భారీ ఓటమి నుంచి జట్టును కాపాడగలిగాడు. 74వ నిమిషంలో ఒలిసే మరోసారి అద్భుతమైన అసిస్ట్ అందించగా.. ఎంబాప్పే తన రెండో గోల్‌ను నమోదు చేసి ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో ఎంబాప్పే ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్య 18కి చేరింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది అతనికి ఆరో గోల్. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంబాప్పే రెండో స్థానానికి చేరాడు. అగ్రస్థానంలో ఉన్న లియోనెల్ మెస్సీ కంటే ఇప్పుడు కేవలం ఒక గోల్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. పరాగ్వేతో జరిగే ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ రికార్డును మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉన్నది.
ఫేవరేట్‌గా నిలిచిందని..
స్వీడన్‌తో మ్యాచ్‌కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెషాంప్స్ తమ జట్టు సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. టోర్నీ ప్రారంభానికి ముందే తమ జట్టు ఫేవరెట్‌గా నిలిచిందని.. గ్రూప్ దశలో మూడు విజయాలతో ఆ అంచనాలను నిజం చేశామని పేర్కొన్నాడు. అయితే, నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్ కీలకమని, ఇక్కడ రెండో అవకాశం ఉండదని చెప్పాడు. ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తూ విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. గ్రూప్ దశలో తొమ్మిది పాయింట్లు సాధించినా నాకౌట్ మ్యాచ్‌ల్లో అది ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదని.. ప్రతి మ్యాచ్‌ను సవాల్‌గానే చూడాల్సి ఉంటుందని డెషాంప్స్ పేర్కొన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం
- ●HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ



