Commercial LPG Cylinder | తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
Commercial LPG Cylinder | వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు (Commercial LPG Cylinder) గుడ్‌న్యూస్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిర్షియల్, పారిశ్రామిక ఉపయోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై (Non Domestic Packed LPG) ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్పీజీ ధరలను (Gas Cylinder Price) కూడా తగ్గించింది.
Commercial LPG Cylinder | త్రినేత్ర.న్యూస్: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు (Commercial LPG Cylinder) గుడ్‌న్యూస్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిర్షియల్, పారిశ్రామిక ఉపయోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై (Non Domestic Packed LPG) ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్పీజీ ధరలను (Gas Cylinder Price) కూడా తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గిస్తున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో రూ.3113గా ఉన్న ఒక్క సిలిండర్ ధర రూ.2930కు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.176 తగ్గడంతో రూ.2994కు చేరింది. ఇప్పటివరకు అది రూ.3,191గా ఉన్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ తగ్గడం, సరిపడా సరఫరా ఉన్న క్రమంలో కమర్షియల్, పారిశ్రామిక ఉపయోగ నాన్- డొమెస్టిక్ ప్యాక్ట్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం గత గురువారం ఎత్తివేసింది. దీంతో పారిశ్రామిక, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు భారీ ఉపశమనం లభించినట్లయింది. వాణిజ్య వినియోగదారులకు (హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు) గ్యాస్ సరఫరాను మునుపటి స్థాయికి (సంక్షోభానికి ముందు స్థాయి) పునరుద్ధరించింది. బల్క్ ఎల్‌పీజీ సరఫరా పరిమితుల్లో 50 శాతం సడలింపులు ఇచ్చింది. వీటితో పాటు వివాహాలు, శుభకార్యాలు, ఇతర ఈవెంనట్లకు కమర్షియల్ సిలిండర్ల కొనుగోలుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంక్షలు తొలగించింది.
Gas Cylinder Price, LPG Cylinder, Commercial LPG Cylinder, Non Domestic Packed LPG
తాజావార్తలు
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!
- ●Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!
- ●Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!





