Norway Vs Ivory Coast | ప్రీక్వార్టర్స్‌లోకి నార్వే..
Norway Vs Ivory Coast | ఫిఫా ప్రపంచకప్ 2026లో నార్వే ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఆర్లింగ్టన్‌లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంటోనియో నుసా, ఎర్లింగ్ హాలాండ్ చేసిన గోల్స్‌తో నార్వే విజయం ఖాయం కాగా.. అమాద్ డియాల్లో చేసిన గోల్ ఐవరీ కోస్ట్ తాత్కాలిక ఊరటనిచ్చింది.
- ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో ఘన విజయం
- మళ్లీ కీలక విజయాన్ని అందించిన ఎర్లింగ్ హాలాండ్
- టోర్నీ నుంచి నిష్క్రమించిన ఐవరీ కోస్ట్
Norway Vs Ivory Coast | ఫిఫా ప్రపంచకప్ 2026లో నార్వే ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఆర్లింగ్టన్‌లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంటోనియో నుసా, ఎర్లింగ్ హాలాండ్ చేసిన గోల్స్‌తో నార్వే విజయం ఖాయం కాగా.. అమాద్ డియాల్లో చేసిన గోల్ ఐవరీ కోస్ట్ తాత్కాలిక ఊరటనిచ్చింది. ఈ గెలుపుతో నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరగా.. తర్వాతి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. మూడో నిమిషంలోనే నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ గోల్ చేసే ప్రయత్నం చేసినా బంతి గోల్‌పోస్ట్‌కు దూరంగా వెళ్లింది. ఎనిమిదో నిమిషంలో ఐవరీ కోస్ట్‌కు చెందిన యాన్ డియోమాండే కూడా జట్టుకు ఆధిక్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం ఇరు జట్లు ఎటాకింగ్‌ను కొనసాగించాయి.
నార్వే ఆధిపత్యం..
తొలిభాగంలో నార్వే ఆధిపత్యం ప్రదర్శించింది. 38వ నిమిషంలో హాలాండ్, ఆ వెంటనే మార్టిన్ ఓడెగార్డ్ గోల్‌కు ప్రయత్నించినా విఫలమయ్యారు. అయితే, 39వ నిమిషంలో ఆంటోనియో నుసా అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో గోల్ చేసి నార్వేకు 1-0 ఆధిక్యం అందించాడు. 42వ నిమిషంలో హాలాండ్ మరోసారి గోల్‌కు ప్రయత్నించగా.. ఐవరీ కోస్ట్ ఆటగాడు గోల్‌లైన్ సమీపంలోనే అడ్డుకున్నాడు. అనంతరం అలెగ్జాండర్ సోర్లోత్ కూడా గోల్ చేయలేకపోయాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నార్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్థంలో ఐవరీ కోస్ట్ స్కోర్‌ని సమయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. 52వ నిమిషంలో ఇబ్రహీం సంగారే, 55వ నిమిషంలో పెపే చేసిన ప్రయత్నాలను నార్వే గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. 64వ నిమిషంలో గ్వేలా డౌయే, 72వ నిమిషంలో ఘిస్లైన్ కొనాన్ చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. 74వ నిమిషంలో అమాద్ డియాల్లో అద్భుతమైన గోల్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను కాపాడుకునే ఉద్దేశంతో నార్వే మరోసారి ఎటాకింగ్‌కు దిగింది. చివరకు 86వ నిమిషంలో ఎర్లింగ్ హాలాండ్ కీలక గోల్ చేసి జట్టుకు 2-1 ఆధిక్యం అందించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో హాలాండ్‌కు ఇది ఐదో గోల్. ఇదే టోర్నీలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ మాత్రమే ఆరు గోల్స్‌తో ముందంజలో ఉన్నాడు.
చివరి వరకు పోరాడిన ఐవరీ కోస్ట్
ఆధిక్యం కోల్పోయిన తర్వాత ఐవరీ కోస్ట్ చివరి వరకు పోరాడింది. అదనపు సమయంలో ఐదో నిమిషంలో మార్టిన్ ఓడెగార్డ్ చేసిన ఫౌల్‌తో వచ్చిన అవకాశాన్ని అమాద్ డియాల్లో గోల్‌గా మలచలేకపోయాడు. నార్వే గోల్‌కీపర్ అద్భుతమైన సేవ్‌తో స్కోర్ సమం కాకుండా అడ్డుకున్నాడు. ఇంజ్యూరీ టైమ్ చివరి క్షణాల్లోనూ ఐవరీ కోస్ట్‌కు మరో అవకాశం వచ్చినా నార్వే గోల్‌కీపర్ మరోసారి కీలకంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు నార్వే ప్రధాన కోచ్ స్టాలే సోల్బాకెన్ మాట్లాడుతూ తమ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తేనే ఐవరీ కోస్ట్‌ను అధిగమించగలమని వ్యాఖ్యానించాడు. సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి 10-15 నిమిషాలు మినహా తమ ఆట అత్యుత్తమంగా సాగిందని, ఐవరీ కోస్ట్‌పై కూడా అదే స్థాయి ప్రదర్శన అవసరమని తెలిపాడు. జట్టు అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నారని, ఎలాంటి సాకులు లేవని పేర్కొన్నాడు. ఐవరీ కోస్ట్ టోర్నీలో అత్యంత బలమైన జట్లలో ఒకటని, ముఖ్యంగా ఆటగాళ్ల శారీరక దారుఢ్యం, సెంటర్‌బ్యాక్‌లు, మిడ్‌ఫీల్డ్ ఆటగాళ్ల బలంగా ఉందని.. తమ జట్టకు ఇది సవాల్‌గా మారుతుందని హెచ్చరించాడు. మ్యాచ్‌లోనూ ఇరు జట్ల మధ్య అదే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చాయి. చివరకు హాలాండ్ గోల్‌తో నార్వే విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కి దూసుకెళ్లింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
జులై 19, 2026

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
జులై 19, 2026

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జులై 19, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



