Horoscope | త్వరలో అరుదైన శుభయోగం.. ఈ మూడురాశుల వారికి అన్నీ శుభవార్తలే..!
Horoscope | వేద జ్యోతిష్య శాస్త్రంలో గురుడు, శుక్రుడు అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా భావిస్తారు. జ్ఞానం, ధనం, అదృష్టానికి ప్రతీకగా గురుడిని పరిగణిస్తే.. ప్రేమ, సౌందర్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలకు శుక్రుడు కారకుడిగా చెబుతారు. అలాంటి ఈ రెండు శుభగ్రహాలు జూలై 10న ఉదయం 5.53 గంటలకు ప్రత్యేక కోణ సంయోగాన్ని ఏర్పరచనున్నాయి.
Horoscope | వేద జ్యోతిష్య శాస్త్రంలో గురుడు, శుక్రుడు అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా భావిస్తారు. జ్ఞానం, ధనం, అదృష్టానికి ప్రతీకగా గురుడిని పరిగణిస్తే.. ప్రేమ, సౌందర్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలకు శుక్రుడు కారకుడిగా చెబుతారు. అలాంటి ఈ రెండు శుభగ్రహాలు జూలై 10న ఉదయం 5.53 గంటలకు ప్రత్యేక కోణ సంయోగాన్ని ఏర్పరచనున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో దీన్నే ద్వాదశ యోగంగా పేర్కొంటారు. ఈ అరుదైన గ్రహ సంయోగం కొద్ది కాలం మాత్రమే ప్రభావంలో ఉన్నప్పటికీ.. కొన్ని రాశుల వారికి విశేష శుభఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత విజయాల్లో అనుకూల మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిథునం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఈ యోగం అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
మిథున రాశి వారికి ఆర్థికంగా ఊరట
గురు–శుక్రుల ద్వాదశ యోగం మిథున రాశి వారికి అనేక శుభ ఫలితాలను ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడంతో గతంలో చేతికందకుండా పోయిన డబ్బులు తిరిగి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగస్వాముల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి పరస్పర నమ్మకం బలపడుతుంది. పరస్పర నమ్మకం బలపడే అవకాశం ఉంది. వివాహితుల దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు, భూములు, కుటుంబ వివాదాలకు సంబంధించిన అంశాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
తుల రాశికి కెరీర్‌లో పురోగతి..
తుల రాశి వారికి ఈ ప్రత్యేక యోగం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగులు తమ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై కెరీర్‌కు కొత్త ఊపునిస్తాయి. వేతనం పెంపు, ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లు, లాభదాయక ఒప్పందాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం కారణంగా కీలక విషయాల్లో విజయాన్ని అందించే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశికి అదృష్టం కలిసివచ్చే కాలం..
ధనుస్సు రాశి వారికి ఈ సంయోగం అదృష్టాన్ని, అభివృద్ధిని తీసుకురానుందని పండితులు చెబుతున్నారు. గురుడు ఈ రాశికి అధిపతి కావడంతో ప్రభావం మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు చేయడంతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు ఈ కాలం ప్రోత్సాహకరంగా ఉండనుంది. కష్టానికి తగిన ఫలితాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మానసికంగా ఉత్సాహం, సానుకూల దృక్పథం పెరగడంతో నిర్ణయాలు మరింత సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
మీన రాశికి విజయాలు..
గురు–శుక్రుల ద్వాదశ యోగం మీన రాశి వారికి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. జీవితంలోని పలు రంగాల్లో అకస్మాత్తుగా అనుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా శ్రమిస్తున్న వారికి పనుల్లో శుభ ఫలితాలను చూస్తారు. అదృష్టం సహకరించడంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి మెరుగైన అవకాశాలు, ఉన్నత పదవులు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలతో ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ, దాంపత్య జీవితాల్లో సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ సమయం ఆనందం, విజయాలు, ఐశ్వర్యానికి కొత్త ద్వారాలు తెరువనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య






