త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | ముగిసిన అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌లు

Ajit Pawar | మ‌హారాష్ట్ర (Maharashtra) ఉప‌ముఖ్య‌మంత్రి, ఎన్సీపీ అధ్య‌క్షుడు అజిత్ ప‌వార్ (Ajit Pawar) అంత్య‌క్రియ‌లు (last rites) పూర్త‌య్యాయి. ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల మ‌ధ్య ఆయ‌న అంత్య‌క్రియ‌లు బారామ‌తిలోని విద్యా ప్ర‌తిష్టాన్ మైదానంలో నిర్వ‌హించారు.

A

Flash news | Published On Jan 29, 2026, 3.22 pm IST

Ajit Pawar | ముగిసిన అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌లు
Advertisement

Ajit Pawar | మ‌హారాష్ట్ర (Maharashtra) ఉప‌ముఖ్య‌మంత్రి, ఎన్సీపీ అధ్య‌క్షుడు అజిత్ ప‌వార్ (Ajit Pawar) అంత్య‌క్రియ‌లు (last rites) పూర్త‌య్యాయి. జిల్లా పంచాయతీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్తున్న ప‌వార్ విమానం బారామ‌తిలో ర‌న్‌వేపై దిగేందుకు య‌త్నిస్తుండ‌గా ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లు మంట‌లు భారీగా ఎగిసిప‌డ‌డంతో అందులో ఉన్న అజిత్ ప‌వార్‌తో పాటు మ‌రో న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌ర‌ణించిన వారిలో అజిత్ ప‌వార్‌తో పాటు ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తాధికారి విదీప్ జాద‌వ్‌, కెప్టెన్ సుమిత్ కుమార్‌, కోపైల‌ట్ శాంభ‌వి పాఠ‌క్‌, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు.

అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌ల‌ను బారామ‌తిలోని విద్యా ప్ర‌తిష్టాన్ మైదానంలో నిర్వ‌హించారు. ముందుగా అజిత్ భౌతిక కాయాన్ని హోల్క‌ర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నుంచి ఆయ‌న నివాసానికి ప్ర‌జ‌లు, అభిమానుల సంద‌ర్శ‌నార్ధం అక్క‌డ అందుబాటులో ఉంచారు. అజిత్ దాదా చివ‌రి చూపు కోసం రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు. అనంత‌రం ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల మ‌ధ్య ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌, మ‌హారాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, వివిధ రాష్ట్రాల ముఖ్య నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అజిత్ మృతికి సంతాపంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రోజుల‌పాటు సంతాప దినాల‌ను ప్ర‌క‌టించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement