OTT | ఓటీటీలోకి మంచు లక్ష్మి తమిళ్ రొమాంటిక్ మూవీ – విజయ్ ఆంటోనీ ప్రొడ్యూసర్
తమిళ మూవీ పూకీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. పూకీలో మంచు లక్ష్మి, సునీల్ కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Mar 5, 2026, 3.47 pm IST
OTT | మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ పూకీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్, ఆర్‌కే ధనుషా హీరోహీరోయిన్లుగా నటించారు. గణేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు.
పూకీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఫిబ్రవరి 13 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
తమిళంలో మాత్రమే...
థియేటర్లలో ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ఓటీటీలో మాత్రం కేవలం తమిళ వెర్షన్ మాత్రమే విడుదలకానున్నట్లు చెబుతోన్నారు. తెలుగు వెర్షన్ నెక్స్ట్ వీక్ నుంచి ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.పూకీ మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ టైటిల్‌పై అభ్యంతరాలు రావడంతో బూకీగా మార్చి ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చారు.
జెన్‌జీ బ్యాచ్...
ప్రేమ విషయంలో జెన్‌జీ బ్యాచ్ అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉంటున్నాయనే కాన్సెప్ట్‌తో దర్శకుడు గణేష్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. కైలాష్, ఆషా ప్రేమికులు. మనస్పర్థల కారణంగా గొడవపడి విడిపోతారు. వారు గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆషాకు బ్రేకప్ చెప్పిన కైలాష్ ఆ బాధ నుంచి బయటపడటానికి ఏం చేశాడు. అతడి జీవితంలోకి వచ్చిన కావ్యతో పాటు మరో అమ్మాయి ఎవరు? ఓ సైకలాజిస్ట్‌తో పాటు బాబాను కైలాష్ ఎందుకు ఆశ్రయించాడు అన్నదే ఈ మూవీ కథ. వైరల్ వీడియోస్ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులతో పాటు జెన్‌జీ బ్యాచ్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫన్నీగా ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్. తమిళంలో మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

OTT Review | కాళిదాస్ 2 రివ్యూ – ట్విస్ట్‌లతో సాగే తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మే 14, 2026

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



