Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ – లాంఛ్ డేట్ … ఛానల్ ఇదే – టైటిల్ ఏంటంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ సంజనా గల్రానీ తెలుగు సీరియల్‌లో లీడ్ రోల్‌లో కనిపించబోతుంది. ఈ సీరియల్ టైటిల్‌తో పాటు లాంఛింగ్ డేట్, ఛానెల్ రివీలయ్యాయి.
Naresh N
Entertainment | Published On Jul 3, 2026, 8.40 pm IST

సంజనా గల్రానీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తెలుగు సీరియల్‌కు ఏ దేవి వరమో నీవు అనే టైటిల్‌ను ఖరారైంది.

జూలై 6 నుంచి స్టార్ మా ఛానెల్‌లో ఏ దేవి వరమో నీవు సీరియల్ టెలికాస్ట్ కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ సీరియల్‌ను చూడొచ్చని స్టార్ మా ప్రకటించింది.

ఈ సీరియల్‌లో పవర్‌ఫుల్ రోల్‌లో సంజనా గల్రానీ కనిపించబోతుంది. స్వర్ణ ఖడ్గం తర్వాత తెలుగులో సంజనా చేస్తోన్న సెకండ్ సీరియల్ ఇది.

హీరోయిన్‌గా సంజనా గల్రానీ తెలుగులో సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసనతో పాటు పలు చిన్న సినిమాలు చేసింది. ప్రభాస్ బుజ్జిగాడుతో పాటు మరికొన్ని స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంజనా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌లో ఐదో రన్నరప్‌గా నిలిచింది.

అజీజ్ పాషా అనే డాక్టర్‌ను 2021లో పెళ్లి చేసుకుంది సంజనా గల్రానీ.
తాజావార్తలు
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం
- ●South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!
- ●Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- ●PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ

Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి

Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!


