త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MJPTBCWREIS | బీఎస్సీ అగ్రికల్చర్‌లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈ నెల 16న కౌన్సెలింగ్‌

MJPTBCWREIS | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో (MJPTBCWREIS) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్ (BSc Honours) కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్న‌ది.

G

Telangana | Published On Nov 14, 2026, 12.02 pm IST

MJPTBCWREIS | బీఎస్సీ అగ్రికల్చర్‌లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈ నెల 16న కౌన్సెలింగ్‌
Advertisement

MJPTBCWREIS | త్రినేత్ర న్యూస్‌: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో (MJPTBCWREIS) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్ (BSc Honours) కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్న‌ది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఈ నెల 16న అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌తో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కావాల‌ని సూచించింది. ఈ మేర‌కు బీసీ గురుకుల విద్యాసంస్థ‌ల సొసైటీ కార్య‌ద‌ర్శి బ‌డుగు సైదులు వెల్ల‌డించారు.

పూర్తి వివరాల‌కు https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని తెలిపారు. రాజేంద్ర న‌గ‌ర్‌లోని వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఉన్న‌ వాటర్ మెనేజ్‌మెంట్ యూనిట్, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈనెల 16న (సోమ‌వారం) ఉదయం 9.30 గంట‌ల వ‌ర‌కు కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకోవాల‌ని సూచించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement