Dil Raju | టాక్సిక్ సినిమాతో లాభాలు వచ్చాయి – పాన్ ఇండియన్ భ్రమలు వీడాలి – దిల్‌రాజు కామెంట్స్ వైరల్
పవన్ కళ్యాణ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్‌రాజు అన్నారు. టాక్సిక్ నష్టాలతో పాటు పాన్ ఇండియన్ కల్చర్‌పై ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు.
Entertainment | Published On Nov 13, 2026, 7.33 pm IST
Dil Raju | టాలీవుడ్ హీరోలపై నిర్మాత దిల్‌రాజు సంచలన కామెంట్స్ చేశారు. పాన్ ఇండియన్ మార్కెట్ గురించి ఆలోచిస్తూ ఆ ఛట్రంలో ఇరుక్కుపోయి తెలుగు హీరోలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓ వైపు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా సినిమాలు చేస్తూనే డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొనసాగుతోన్నారు దిల్‌రాజు. ఇటీవల దిల్‌రాజు రిలీజ్ చేసిన రామాయణతో పాటు సూర్య సీన్ సినిమాలు భారీగా వసూళ్లను రాబడుతోన్నాయి.
ఈ సక్సెస్‌లపై దిల్‌రాజు రియాక్ట్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పాన్ ఇండియన్ కల్చర్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు.
పాన్ ఇండియన్ ఇమేజ్...
ప్రయోగాత్మక కథాంశాలతో తెలుగు హీరోలు చేసినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. కోలీవుడ్ హీరో సూర్య ప్రతి సినిమాలో కథ, పాత్రల పరంగా వేరియేషన్ చూపుతున్నాడు. అలా మన తెలుగు హీరోలు కూడా ఆలోచించాలి. కానీ పాన్ ఇండియన్ ఇమేజ్ కారణంగా అన్ని భాషల ఆడియెన్స్, మార్కెట్ గురించి ఆలోచిస్తూ ప్రయోగాలకు దూరమవుతున్నారు. ఆ ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలని దిల్‌రాజు అన్నారు.
పవన్ కళ్యాణ్ తో సినిమా...
పవన్ కళ్యాణ్‌తో సినిమాపై దిల్‌రాజు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఓ ప్రొడ్యూసర్‌గా, వకీల్ సాబ్ నిర్మాతగా పవన్ కళ్యాణ్‌ను ఇటీవల కలిశాను. అవకాశం ఉంటే ఆయనతో మళ్లీ సినిమా చేస్తా. పవన్‌తో మళ్లీ అద్భుతమైన సినిమా చేయాలనుంది. ప్రాపర్‌గా అన్ని రెడీ అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ సినిమాను అఫీషియల్‌గా ప్రకటిస్తానని దిల్‌రాజు పేర్కొన్నారు. టాక్సిక్ సినిమా తనకు లాభాలు తెచ్చిపెట్టిందని అన్నారు. నష్టాలు వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని దిల్‌రాజు అన్నారు.
వెయ్యి కోట్లు...
రామాయణ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇంత అద్భుతమైన విజయం అందుకోవడం, ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సక్సెస్ ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. సక్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి, దాని నుంచి ఎనర్జీ తెచ్చుకోవాలి. అదే నా ఫార్ములా.ఒక మంచి కథ రాసుకుని, ఎంత కాంపాక్ట్‌గా సినిమా తీసి హిట్ కొట్టవచ్చో సూర్య ‘సీన్’ సినిమా ద్వారా నేర్చుకున్నా. ఈ సినిమా నాకు చాలా మంచి విషయాలు నేర్పించింది. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ బడ్జెట్ సినిమాలే అవసరం లేదు. ఒక మంచి కథతో కూడా ప్రేక్షకులను ఎలా అలరించవచ్చో ‘సీన్’ ద్వారా తెలుసుకున్నా అని దిల్ రాజు చెప్పారు.
30 ఏళ్లు...
నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. ఈ జర్నీలో ఎన్నో విజయాలు చూశా, అపజయాలు ఎదుర్కొన్నా. నేను ఎప్పుడూ ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను. బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తా అని దిల్‌రాజు అన్నారు.
సంబంధిత వార్తలు

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల – “ఓం” సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
నవంబర్ 14, 2026

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా – “కాంత” కోసం ఆడిషన్ ఇచ్చా కానీ – సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 14, 2026

Ntr | ఊహించని కాంబో సెట్ – అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



