DNK Review | దొంగ నా కొడుకు మూవీ రివ్యూ – కామెడీ తక్కువ …కన్ఫ్యూజన్ ఎక్కువ
సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లోకి హీరోలుగా చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. అందులో యూట్యూబర్ మౌళి ఒకరు. లిటిల్ హార్ట్స్‌తో హీరోగా మారాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ మౌళితో సినిమా చేసేందుకు ముందుకొచ్చింది. దొంగ నా కొడుకు (డీఎన్‌కే) పేరుతో మౌళి చేసిన కొత్త మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Nov 13, 2026, 6.21 pm IST
DNK Review | ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమలతో యువత బెట్టింగ్ యాప్‌ల బారిన పడుతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ఈ బెట్టింగ్ చివరకు వ్యసనంగా మారుతోంది. పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే అత్యాశతో అప్పులు చేసి మరి ఈ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. ఆర్థికంగా నష్టాల పాలై కుటుంబం, సమాజం దృష్టిలో మోసగాళ్లుగా మిగిలిపోతున్నారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, దోపీడిలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి వారి జీవితాల నుంచే స్ఫూర్తి పొంది దొంగ నా కొడుకు సినిమా కథను రాసుకున్నారు దర్శకుడు శ్రీను కంబాల. ఈ సీరియస్ పాయింట్‌ను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారు.
ఈశ్వర్ అప్పులు...
నారాయణ (అలీ) ఓ జ్యూవెల్లరీ స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తాడు. కొడుకు ఈశ్వర్ (మౌళి) పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని కలలు కంటాడు. బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే మానేస్తాడు. ఇంట్లో చిల్లర దొంగతనాలు, అప్పులు చేస్తూ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పొగొట్టుకుంటాడు. చివరకు తాను ప్రేమించిన అమ్మాయి దీపు (సుస్మిత శెట్టి) నుంచి కూడా పది లక్షలు తీసుకుంటాడు.
ఈ విషయం దీపు తండ్రి పుల్లయ్యకు తెలుస్తుంది. నెల రోజుల్లోపు పది లక్షలు తిరిగి ఇవ్వాలని ఈశ్వర్‌కు వార్నింగ్ ఇస్తాడు. అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో తన తండ్రి పనిచేస్తున్న జ్యూవెల్లరీ షాప్‌కు కన్నం వేయాలని ఈశ్వర్ ప్లాన్ చేస్తాడు. సరిగ్గా అదే రోజు ఈశ్వర్ కంటే ముందే మరో గ్యాంగ్ ఆ జ్యూవెల్లరీ షాప్ మొత్తాన్ని దోచుకుంటారు. ఆ గ్యాంగ్ దోచుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగ్ ఈశ్వర్‌కు దొరుకుతుంది. ఆ బ్యాగ్ కారణంగా ఈశ్వర్ జీవితం ఎలా చిక్కుల్లో పడింది? దీపు తండ్రి గురించి ఈశ్వర్‌కు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? ఈశ్వర్ కోసం పోలీసులతో పాటు గుండుబాస్ ఎందుకు వెతుకుతున్నారు? ఈ చిక్కుల నుంచి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు? అన్నదే దొంగ నా కొడుకు మూవీ కథ.
చిల్లర సినిమా....
ఈ ఏడాదిలో తెలుగులో వచ్చిన మోస్ట్ చిల్లర్ మూవీ డీఎన్‌కే అంటూ ఇటీవల మేకర్స్ ప్రమోషన్స్‌లో ప్రకటించారు. నిజంగానే వారు చెప్పినట్లుగానే సినిమా చిల్లరగానే ఉంది. యూత్ సినిమా అంటే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండటం ప్రస్తుతం కామన్‌గా మారిపోయింది. కానీ ఈ సినిమాలో ఇంకాస్త హద్దులు దాటేశారు. హీరోయిన్‌ను చూసి హీరో ప్రేమలో పడే సీన్...ఆ తర్వాత తనకు తమ్ముడు ఉన్నాడంటూ హీరో చెప్పే డైలాగ్ చాలా వల్గర్‌గా ఉంది. బూతు జోకులు సినిమాలో చాలానే కనిపిస్తాయి.
స్వేచ్ఛ ఎక్కువే...
సినిమాకు లాజిక్‌లతో పని ఉండదు. అందులోనూ కామెడీ సినిమా అంటే ఇంకాస్త స్వేచ్ఛ ఎక్కువగానే తీసుకుంటారు. డీఎన్‌కేలో ఆ లిబర్టీ పీక్స్‌కు చేరింది. క్లాక్ రూమ్ నుంచి బ్యాగులు తీసుకెళ్లినంత హాయిగా హీరో అతడి స్నేహితుడు బంగారం దొంగిలిస్తుంటారు...పోలీస్ స్టేషన్‌కు వచ్చిపోతుంటారు....చివరకు వారే పెద్ద క్రైమ్‌ను సాల్వ్ చేసి మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్‌ను పట్టుకుంటారు. ఇన్ని చేసిన హీరోకు ఓ చిన్న బ్యాగ్ మాయం చేయడం మాత్రం తెలియకపోవడం సిల్లీగా అనిపిస్తుంది.
స్ఫూఫ్...
సోషల్ మీడియా, టీవీ షోలతో వినోదం అరచేతిలోకి అందుబాటులోకి వచ్చింది. ఇంకా స్ఫూఫ్‌లు, ఇమిటేషన్లతో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించాలని ప్రయత్నించడం అత్యాశే అవుతుంది. దర్శకుడు శీను కథను కాకుండా ఈ స్ఫూఫ్‌లనే ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపించింది.
మౌళి తనుజ్‌కు కామెడీ టైమింగ్ ప్లస్ పాయింట్. అదే అతడికి యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. తన బలాన్ని పక్కనపెట్టి మాస్ ఇమేజ్ కోసం ఇందులో ప్రయత్నించినట్లు కనిపించింది. సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి. కానీ వాటిని తెరపై ఆవిష్కరించే విధానంలోనే దర్శకుడు తడబడిపోయాడు. బెట్టింగ్‌లతో మొదలైన సినిమా ఏటెటో తిరుగుతుంది.సుస్మిత శెట్టి హీరోయిన్ అనడం కంటే గెస్ట్ అని చెప్పుకోవడం బెటర్. సినిమాలో రఘుబాబు, అలీ, భద్రమ్‌తో పాటు చాలా మంది కమెడియన్లు కనిపిస్తారు. కానీ ఎవరూ పెద్దగా నవ్వించలేకపోయారు.
డీఎన్‌కే షార్ట్‌ఫిల్మ్‌కు ఎక్కువ...సినిమాకు తక్కువ...
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా – “కాంత” కోసం ఆడిషన్ ఇచ్చా కానీ – సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 14, 2026

Ntr | ఊహించని కాంబో సెట్ – అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
నవంబర్ 14, 2026

Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత – హీరోగా తొలి ఛాన్స్ – విలన్‌గా ఫేమస్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
- ●Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం
- ●Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ 'బిర్యానీ క్వీన్' నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!
- ●Travel In November | ఫ్యామిలీ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? చలికాలంలో సందర్శించాల్సిన 8 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలివే..!
- ●Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!

BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్

Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం

Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ 'బిర్యానీ క్వీన్' నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!



