త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yellamma Glimpse | ర‌గ్గ్‌డ్ లుక్‌లో దేవిశ్రీప్ర‌సాద్ – హీరో ఎంట్రీ కోసం స్ట‌న్నింగ్ మేకోవ‌ర్ – ఎల్ల‌మ్మ గ్లింప్స్ అదుర్స్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎల్ల‌మ్మ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను సంక్రాంతి కానుక‌గా గురువారం రిలీజ్ చేశారు. రా అండ్ ర‌స్టిక్‌గా సాగిన ఈ గ్లింప్స్‌లో ర‌గ్గ్‌డ్ లుక్‌లో దేవిశ్రీప్ర‌సాద్ క‌నిపిస్తోన్నారు.

N

Entertainment | Published On Jan 15, 2026, 5.22 pm IST

Yellamma Glimpse | ర‌గ్గ్‌డ్ లుక్‌లో దేవిశ్రీప్ర‌సాద్ – హీరో ఎంట్రీ కోసం స్ట‌న్నింగ్ మేకోవ‌ర్ – ఎల్ల‌మ్మ గ్లింప్స్ అదుర్స్‌
Advertisement

Yellamma Glimpse |  టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. సంక్రాంతి కానుక‌గా అత‌డి డెబ్యూ మూవీ ఎల్ల‌మ్మ‌పై అఫీషియ‌ల్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఎల్ల‌మ్మ మూవీకి బ‌ల‌గం ఫేమ్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గురువారం రోజు ఎల్ల‌మ్మ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. రా అండ్ ర‌స్టిక్‌గా ఈ గ్లింప్స్ సాగింది.
ఈ గ్లింప్స్‌లో కాళ్ల‌కు గ‌జ్జెలు క‌ట్టుకొని ఓ వ్య‌క్తి ప‌రిగెడుతూ క‌నిపించాడు అత‌డి పాదాల‌కు ప‌సుపు, కుంకుమ ఉన్నాయి. ఆ త‌ర్వాత మ‌రో వ్య‌క్తి షూస్ ధ‌రించి ప‌రిగెత్తుతున్న‌ట్లుగా చూపించారు. అత‌డి కాళ్ల నుంచి ర‌క్తం కారుతోంది. వీటితో పాటు ఓ పొట్టేలు గ్లింప్స్‌లో క‌నిపించింది.
గ్లింప్స్ చివ‌ర‌లో వ‌ర్షంలో త‌డుస్తూ చెరువు ఒడ్డున ఉన్న బండ‌పై కూర్చొని దేవిశ్రీప్ర‌సాద్ ఎంట్రీ ఇవ్వ‌డం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఒంటిపై ష‌ర్ట్ లేకుండా భుజానికి డ‌ప్పు త‌గిలించుకొని పొడ‌వైన గ‌డ్డం, హెయిర్ స్టైల్‌తో ర‌గ్గ్‌డ్ లుక్‌లో దేవిశ్రీప్ర‌సాద్ క‌నిపిస్తోన్నారు. ఎల్ల‌మ్మ మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్‌కు ఆయ‌న అందించిన మ్యూజిక్ ఆక‌ట్టుకుంటోంది.

తెలంగాణ సంస్కృతి...

ఎల్ల‌మ్మ మూవీలో దేవిశ్రీప్ర‌సాద్ ప‌ర్శి అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ రివీల్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఎల్ల‌మ్మ మూవీ కోసం ఫిజిక‌ల్‌గా దేవిశ్రీప్ర‌సాద్ చాలానే ట్రాన్స్‌ఫ‌ర్మ్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది.
తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రిస్తూ రూటెడ్ మూవీగా ఎల్ల‌మ్మ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది.
బ‌ల‌గం త‌ర్వాత వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఎల్ల‌మ్మ రెగ్యూల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.

తొలుత ఎల్ల‌మ్మ మూవీని నానితో చేయాల‌ని అనుకున్నారు డైరెక్ట‌ర్ వేణు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. నితిన్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు చాలా మందికి ఈ క‌థ‌ను వినిపించాడు. చివ‌ర‌కు దేవిశ్రీప్ర‌సాద్ డెబ్యూ మూవీగా ఎల్ల‌మ్మ సెట్స్‌పైకి రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 

 ;

Advertisement

తాజావార్తలు

Advertisement